బిర్యానీని టిఫిన్స్ జాబితాలో చేర్చిన చాట్‌జీపీటీ.. తాను హైదరాబాదీ అంటూ సత్య నాదెళ్ల రియాక్షన్ ఇదే..

By Sumanth KanukulaFirst Published Jan 5, 2023, 12:38 PM IST
Highlights

మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల చాట్‌జీపీటీతో (ChatGPT)విభేదించారు. అందుకు ఆ సాఫ్ట్‌వేర్ క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ పరిణామానికి బిర్యానీ కారణంగా నిలిచింది. 

మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల చాట్‌జీపీటీతో (ChatGPT)విభేదించారు. అందుకు ఆ సాఫ్ట్‌వేర్ క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ పరిణామానికి బిర్యానీ కారణంగా నిలిచింది. అసలేం జరిగిందంటే.. చాట్‌జీపీటీ అనేది శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేర్ అన్న సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో సత్య నాదెళ్ల మాట్లాడారు. భారతదేశంలో జరుగుతున్న అత్యాధునిక ఏఐ, క్లౌడ్ ఆవిష్కరణల గురించి తన ప్రెజెంటేషన్‌ ఇచ్చేముందు.. అక్కడివారికి చాట్‌జీపీటీ (పాపులర్ ఏఐ-ఎనేబుల్డ్ సాఫ్ట్‌వేర్) సంభాషణను పరిచయం చేయాలని నిర్ణయించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన దక్షిణ భారత టిఫిన్ ఐటమ్‌లను తెలుపాలని నాదెళ్ల చాట్‌జీపీటీని కోరారు. దీంతో సాఫ్ట్‌వేర్.. ఇడ్లీ, దోస, వడ వంటి పేర్లను తెలియజేసింది. అయితే ఆ జాబితాలో బిర్యానీ కూడా ఉంది. అయితే దీనిపై చాట్‌జీపీటీతో సత్య నాదెళ్ల‌ విభేదించారు. ఈ క్రమంలోనే.. సాఫ్ట్‌వేర్ బిర్యానీని సౌత్ ఇండియన్ టిఫిన్ అని పిలవడం ద్వారా హైదరాబాదీ అయిన తన తెలివితేటలను అవమానించదని సత్య నాదెళ్ల ChatGPTకి చెప్పారు. దీంతో అక్కడివారు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. నాదెళ్ల అది తప్పు అని చెప్పిన సమయంలో.. సాఫ్ట్‌వేర్ మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పింది. ‘‘మీరు చెప్పింది నిజమే. ఇది దక్షిణ భారతదేశంలో టిఫిన్ డిష్‌గా వర్గీకరించబడలేదు’’ అని తెలిపింది.
         
ఆ తర్వాత నాదెళ్ల ఇడ్లీ, దోసల మధ్య ఏది బాగుంటుందో అనేదానిపై ఒక నాటకాన్ని సృష్టించమని ChatGPTకి చెప్పారు. పిండికి సాహిత్యాన్ని జోడించడానికి, నాదెళ్ల షేక్‌స్పియర్ నాటకంలో ఒక భాగం మాదిరిగా సంభాషణను రూపొందించమని సాఫ్ట్‌వేర్‌ను కోరారు. ఇక, చాట్‌జీపీటీ వంటి మోడల్‌లు ప్రజల ఊహలను ఎలా ఆకర్షిస్తున్నాయో చూడటం ఆనందంగా ఉందని నాదెళ్ల అన్నారు.

click me!