
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు పంపింది. ఈ నెల 16న విచారణకు రావాలని సీబీఐ కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో వచ్చిన డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఖర్చు చేసిందని సీబీఐ ఆరోపించింది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జీషీట్లలో దర్యాప్తు సంస్థలు ఈ అంశాన్ని పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జీషీట్ లో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత పేర్లను దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పేరును దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: సప్లిమెంటరీ చార్జీషీట్‌లో మాగుంట రాఘవ సహా ముగ్గురి పేర్లు
ఈ ఏడాది ఫిబ్రవరి 23న అరవింద్ కేజ్రీవాల్ పీఏ కు ఈడీ అధికారులు సమన్లు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న అరవింద్ కేజ్రీవాల్ పీఏ కు ఈడీ అధికారులు సమన్లు పంపారు. మనీలాండరింగ్ ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 6వ తేదీన సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేసింది ఈడీ,. ఈ సప్లిమెంటరీ చార్జీషీట్ లో మాగుంట రాఘవ , రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పై అభియోగాలు మోపింది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చి మాసంలో మూడు దఫాలు ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులకు అందించారు కవిత ప్రతినిధి సోమ భరత్ ముందు ఈడీ అధికారులు ఈ ఫోన్లను ఓపెన్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు సంస్థలు విచారణ నిర్వహించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలువురిని దర్యాప్తు సంస్థలు విచారించాయి. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా సీబీఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.