ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించిన కేజ్రీవాల్‌.. ఇంతకీ ఏమన్నారంటే..?

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 2:08 PM IST
Highlights

గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఆప్ కి అనుకూల ఫలితాలు వస్తాయని అన్నారు. అధికార బిజెపికి సవాలు విసిరేందుకు భారీ ప్రచారాన్ని ప్రారంభించిందనీ, ఢిల్లీ సివిక్ ఎన్నికల్లో ఆప్ గర్జించే విజయమని అన్నారు.

గుజరాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. గుజరాత ఎన్నికల ఫలితాలు తమకు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. బీజేపీకి  కంచుకోట, ప్రధాని స్వంత రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ (ఆప్)కి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 15 నుండి 20 శాతం ఓట్లు రావడం మాములు విషయం కాదనీ, నిజంగా ఇది పెద్ద విజయమని కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు.\

ఈ సర్వేలు తప్పని, వాస్తవానికి తన పార్టీ దాదాపు 100 సీట్లను గెలుస్తుందని ఆప్ నేత పేర్కొన్నారు.కౌంటింగ్ రోజు వరకు వేచి ఉండాలని అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు ఆప్‌పై మరోసారి విశ్వాసం ఉంచారని, ఇది మంచి ఫలితాన్నిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలల్లో ఆప్‌కు ప్రతికూల ఫలితాలు రావడంపై ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా సైతం స్పందించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయనీ, ఆప్‌ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. వాళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు చిక్కరని కామెంట్‌ చేశారు.

ఢిల్లీ ఎంసిడి ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే .. గుజరాత్‌లో ఆప్‌ దూకుడుగా ప్రచారం చేసినా..మూడోస్థానంలో నిలిచి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని దాదాపు అన్ని సర్వేలు పేర్కొంటున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఆప్ పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ కూడా ఆప్ పరాభవం ఎదుర్కొంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

click me!