అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్..

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 11:25 AM IST
Highlights

అనేకసార్లు సమన్లు ​​పంపినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్‌ కోర్టుకు హాజరు కాకపోవడంతో అదనపు సెషన్‌ జడ్జి రాహుల్‌ మిశ్రా గురువారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్: అత్యాచారం కేసులో మరో బీజేపీ ఎమ్మెల్యేకి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఓ బాలికమీద అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎనిమిదేళ్ల నాటి బాలికపై అత్యాచారం కేసులో దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు సమన్లు ​​పంపినప్పటికీ శాసనసభ్యుడు రామ్‌దులర్‌ కోర్టుకు హాజరు కాకపోవడంతో అదనపు సెషన్‌ జడ్జి రాహుల్‌ మిశ్రా గురువారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.

వారెంట్ ప్రకారం ఎమ్మెల్యేను అరెస్టు చేసి జనవరి 23న కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సహాయ జిల్లా ప్రభుత్వ న్యాయవాది సత్య ప్రకాష్ త్రిపాఠి శుక్రవారం దీనిమీద మాట్లాడుతూ, నవంబర్ 4, 2014న మైయోర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి.. ఆ సమయంలో గ్రామపెద్దగా ఉన్న మహిళ భర్త రామ్‌దులార్ తన సోదరిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఫిర్యాదు మీద పోలీసులు సమగ్ర విచారణ జరిపించారు. అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు. అయితే, ఈ కేసు విచారణకు హాజరు కావాలని రామ్‌దులర్‌కు కోర్టు చాలాసార్లు సమన్లు ​​జారీ చేసినప్పటికీ ఆరోగ్య కారణాల వల్ల హాజరు కాలేదని త్రిపాఠి చెప్పారు.

కారు ఎక్కనని చెప్పినా వినలే.. యూటర్న్ తీసుకొచ్చి మరీ - స్వాతి మలివాల్ కు ఎదురైన ఘటనలో బయటకొచ్చిన వీడియో

ఇదిలా ఉండగా, రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడి కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతని మీద జాంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన ఒక మహిళ అత్యాచారం ఆరోపణలతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, జంజ్‌గిర్ చంపా ఎమ్మెల్యే నారాయణ్ చందేల్ కుమారుడు పలాష్ చందేల్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు.

ఈ మేరకు అత్యాచారం ఆరోపణలతో నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సదరు బాధిత మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, అత్యాచారం చేశాడని.. ఆ తరువాత తాను గర్భం దాల్చడంతో.. చందేల్ తన బిడ్డను బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించారు.

ఈ సమస్యను లేవనెత్తుతూ ఆమె ఇంతకుముందు రాయ్‌పూర్‌లోని ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు వ్రాతపూర్వక ఫిర్యాదును సమర్పించింది. గత కొన్ని నెలలుగా ఈ విషయంపై విచారణ జరుగుతోంది. కమిషన్ గురువారం కేసును పోలీసులకు అప్పగించింది. రాయ్‌పూర్‌లోని మహిళా ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.కేసు ఫైల్‌ను విచారణ, తదుపరి చర్యల కోసం జాంజ్‌గిర్ పోలీసులకు పంపారు.ఓబీసీకి చెందిన నారాయణ్ చందేల్ ఇటీవల ఎల్ఓపీగా నియమితులయ్యారు.

చందేల్ జాంజ్‌గిర్ నియోజకవర్గం నుండి క్రమం తప్పకుండా విజయం సాధిస్తూ వస్తున్నాడు. దీంతో అతనికి ఈ ప్రాంతంలో రాజకీయ పలుకుబడిని ఎక్కువగానే ఉంది. భానుప్రతాపూర్ (ఎస్టీ) నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా, బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతమ్‌పై అత్యాచారం కేసు నమోదైంది. పొరుగున ఉన్న జార్ఖండ్‌కు చెందిన పోలీసులు బీజేపీ నాయకుడిని అదుపులోకి తీసుకునే ప్రచారంలో నియోజకవర్గంలో క్యాంప్ చేశారు. అయితే, జార్ఖండ్ హైకోర్టు స్టే ఆర్డర్‌తో అతనిని టీమ్ అరెస్టు చేయలేదు. 

click me!