జమ్మూకాశ్మీర్‌‌లో ఎన్కౌంటర్...ఆర్మీ మేజర్, ముగ్గురు జవాన్ల మృతి, ఇద్దరు ఉగ్రవాదులు కూడా

First Published Aug 7, 2018, 3:57 PM IST
Highlights

జమ్మూకాశ్మీర్ బోర్డర్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే  గురేజ్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడటంతో ఓ ఆర్మీ మేజర్ తో పాటు ముగ్గురు సైనికులు మృతిచెందారు. భద్రతా దళాల తుపాకి తూటాలకు ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో గురేజ్ వద్ద గల నియంత్రణ రేఖను దాటుకుని ఎనిమిది మంది ఉగ్రవాదులు చొరబడ్డారు. అయితే వారిని గుర్తించిన భద్రతా సిబ్బంది బోర్డర్ వద్దే అడ్డుకున్నారు. దీంతో మారణాయుధాలను ధరించి వున్న వారు భారత సైనికులపై కాల్పులకు దిగారు. దీంతో  భద్రతా సిబ్బంది కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ తో పాటు ఇద్దరు సైనికులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.

భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. మిగతా ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ తో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గురేజ్ ప్రాంతం తుపాకుల మోతలతో భయంకరంగా మారింది. 
 
click me!