
గువహతి: అరుణాచల్ ప్రదేశ్‌లో అడ్వాన్స్ లైట్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. రెగ్యులర్‌గా వేసే రౌండ్‌లలో భాగంగానే ఈ హెలికాప్టర్ బయల్దేరింది. ఇందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఐదుగురిలో నలుగురి డెడ్ బాడీలను రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. కాగా, మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆయన కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తున్నట్టు ఆర్మీ వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్ అప్పర్ సియాంగ్ జిల్లాలో శుక్రవారం ఉదయం సుమారు 10.43 గంటల ప్రాంతంలో ఈ ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయినట్టు తెలిసింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టుటింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో మిగ్గింగ్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కొండ ప్రాంతంలో జరిగింది. ఈ స్పాట్‌కు సమీప గ్రామం కనీసం 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి ఎలాంటి రోడ్లు లేవని అప్పర్ సియాంగ్ జిల్లా ఎస్పీ జుమ్మర్ బసార్ వివరించారు. రెస్క్యూ టీమ్‌ను పంపినట్టు డిఫెన్స్ పీఆర్‌వో గువహతి వెల్లడించారు. ఓ రెస్క్యూ టీమ్‌ను వెంటనే పంపించామని ఘటన జరిగిన వెంటనే తెలిపారు.
ఈ ఘటనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. భారత ఆర్మీ గురించి ఒక ఆందోళనకర వార్త తెలిసిందని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో ఆర్మీకి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ క్రాష్ అయిందని తెలిపారు.
అప్పర్ సియాంగ్ జిల్లా టుటింగ్ ఏరియాలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయిన విని షాక్ అయ్యానని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ పేర్కొన్నారు. రాష్ట్ర రెస్క్యూ టీమ్ వెంటనే స్పాట్‌కు వెళ్లిందని తెలిపారు. అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నట్టు వివరించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరగడం ఈ నెలలో ఇది రెండోది.