షాకింగ్ ఘ‌ట‌న‌.. నీళ్లు తీసుకురావ‌డానికి నో చెప్పాడ‌ని రూమ్‌మేట్‌ను చంపేశాడు..

Published : Oct 21, 2022, 12:04 PM IST
షాకింగ్ ఘ‌ట‌న‌.. నీళ్లు తీసుకురావ‌డానికి నో చెప్పాడ‌ని రూమ్‌మేట్‌ను చంపేశాడు..

సారాంశం

Ahmedabad: నీళ్లు తీసుకురావలంటూ చెప్ప‌డంతో దానికి నిరాక‌రించిన రూమ్‌మేట్‌ను చంపేశాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటుచేసుకుంది.   

Gujarat: నీళ్లు తీసుకురావాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన 28 ఏళ్ల వ్యక్తి తన 58 ఏళ్ల రూమ్మేట్ ను చంపేశాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న గుజ‌రాత్ లో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ లోని ఘుమా ప్రాంతంలో బుధవారం ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదుచేస‌కున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే... నీళ్లు తీసుకురావడానికి అభ్యంతరం చెప్పాడని ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన అహ్మదాబాద్‌లోని ఘుమా ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. 58 ఏళ్ల వ్యక్తి నీరు తీసుకురావడానికి నిరాకరించినందుకు అతని రూమ్‌మేట్ కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. మృతుడు జైకిషన్ పంచల్‌గా గుర్తించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. జితు కటారియా అనే నిందితుడిపై పంచల్ కుమారుడు పునీత్ బోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన తండ్రి ఘుమాలోని గ్రీన్ సిటీ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని పునీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడు కూడా గత 15 ఏళ్ల నుంచి అక్క‌డే ఉంటున్నాడు. 

బుధవారం, పంచల్ కుమారుడికి తన తండ్రి రూమ్‌మేట్ భూపేంద్ర భదౌరియా నుండి కాల్ వచ్చింది,  తన తండ్రిపై దాడి చేసినట్లు జరిగిన ఘ‌ట‌న గురించి చెప్పాడు. కొట్టిన తర్వాత పంచల్‌ను ఘుమాలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాల్ అందుకున్న వెంటనే పునీత్ తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో భదౌరియా పాంచల్ కుమారుడికి మొత్తం సంఘటనను వివరించాడని పేర్కొంది.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. కటారియా, పంచల్ వంట చేస్తున్నారు. అయితే, గదిలో నీళ్లు అయిపోయాయి. ఆహారం వండడానికి, కటారియా పంచాల్‌ను సొసైటీలోని ఒక ఇంటి నుండి నీరు తీసుకురావాలని కోరాడు. అయితే, కటారియా ఆదేశించడం పంచల్‌కు నచ్చలేదు. ఈ క్ర‌మంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. ఇద్దరు కూడా ఎదురు దెబ్బలు కొట్టుకున్నారు. ఈ మధ్య కటారియా గదిలో పడి ఉన్న బ్యాట్‌ని తీసుకుని పంచల్‌ను కొట్టాడు. పంచాల్ ఛాతీపై కూడా కొట్టాడు. వారి గొడవ విని, భదౌరియా గదిలోకి ప్రవేశించాడు. అయితే, అయితే, అప్పటికి పంచల్ నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఘుమా సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతలో, నేరస్థలం నుండి పారిపోయిన కటారియాను ఘుమా లో పోలీసులు  అరెస్టు చేశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌రో షాకింగ్ ఘ‌ట‌న..

పొరుగింటిలో ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డుతుండ‌గా, వారి మ‌ధ్య‌లో జోక్యం చేసుకున్న వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌య్యాడు. భార్య, త‌న‌ మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్నందుకు పొరుగు వ్య‌క్తిని నిందితుడు ఇంటికి వెళ్లిమ‌రి చంపేశాడని ఇండియా టూడే నివేదించింది. ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం కావ‌డంతో మటన్ వంట విషయంలో తన భార్యకు, త‌న‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా, ఆ శబ్దం విన్న తరువాత బిల్లు అనే పొరుగింటి వ్య‌క్తి అక్క‌డ‌కు చేరుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాడు. అయితే, త‌మ మ‌ధ్య జోక్యం చేసుకున్నాడ‌ని ఆ వ్య‌క్తి.. బిల్లును అత‌ని ఇంటికి వెళ్లి హ‌త్య చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే