కేవ‌లం రెండువారాల్లో ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ ని నిర్మించిన ఆర్మీ.. ప్ర‌జ‌ల‌కు అంకితం.. ఆ బ్రిడ్జ్ ఎక్క‌డ ఉందంటే?

By Rajesh KarampooriFirst Published Sep 27, 2022, 11:06 PM IST
Highlights

కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మహూ-మాంగిట్ ప్రవాహానికి అడ్డంగా 37 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు తో పాదచారుల కోసం ఆర్మీ వంతెన నిర్మించింది. ఈ వంతెన 1.5 టన్నుల భారాన్ని తట్టుకోగలదని జమ్మూకు చెందిన ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ అధికారి తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆర్మీ ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ ని కొత్తగా నిర్మించింది. ఈ బ్రిడ్జ్ ను మంగ‌ళ‌వారం ప్రజలకు అంకితం చేసింది. మహూ-మాంగిట్ ప్రవాహానికి అడ్డంగా 37 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న పాదచారుల వంతెన ను ఆర్మీ నిర్మించింది.  దాదాపు 1.5 టన్నుల భారాన్ని తట్టుకోగలదని జమ్మూకు చెందిన ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.

ఈ ఉక్కు వంతెన మహు, మాంగిట్ గ్రామాలను కలుపుతుందని, పాదచారులు సులభంగా ప్రయాణించేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇంతకుముందు, రెండు వైపులా కలిపే తాత్కాలిక చెక్క వంతెన మాత్రమే ఉందని, దానిని ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని ప్రతినిధి చెప్పారు.

"గతంలో.. శీతాకాలం, వసంతకాలం ప్రారంభంలో ఇరు గ్రామాల ప్ర‌జ‌లు.. ఇటు నుంచి అటు.. అటు   నుంచి ఇటు తిర‌గ‌డం పూర్తిగా మానివేశారు. శీతాకాలంలో గ్రామస్తులు మంచుకు భయపడి చెక్క వంతెనను దాటలేరు. అలాగే.. వసంతకాలంలో తరచుగా వరదలు రావడంతో ఇరు పాంత్రాల మ‌ధ్య రాక‌పోక‌లు చాలా క‌ష్టంగా ఉండేవి. 

ఫ్రెండ్ షిప్ బ్రిడ్జ్  అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల ఏడాది పొడవునా ఇరువైపులా రవాణా సుల‌భత‌రం కానున్న‌ది.  అలాగే ప్రాథమిక సేవలు, మార్కెట్‌లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించింది. ఈ వంతెన ద్వారా 1,200 మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతారని అధికారి తెలిపారు. రెండు వారాల్లోపే వంతెనను నిర్మించినందుకు గ్రామస్తులు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన 52 RCC GREF మంగళవారం రాంబన్‌లోని మైత్రా వద్ద చీనాబ్ నదిపై 240 అడుగుల పొడవైన CI-40R బెయిలీ సస్పెన్షన్ బ్రిడ్జ్ (జూలా వంతెన) పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది. రాంబన్ డిప్యూటీ కమిషనర్ ముస్సరత్ ఇస్లాం, అదనపు డిప్యూటీ కమిషనర్ హర్బన్స్ లాల్ శర్మతో కలిసి బ్రిడ్జిని పునఃప్రారంభించడంలో పురోగతిని పరిశీలించారు.

click me!