
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా సైన్యంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన దరఖాస్తులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై బీజేపీ ఫైర్ బ్రాండ్ కె.అన్నామలై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో సాయుధ బలగాలు నిరాశకు గురయ్యాయని అన్నారు. 2009 నుంచి 2013 మధ్య కాలంలో 52,243 మంది సైనికులు ఆర్మీ నుంచి అకాల రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం “ఆర్మీ యాజ్ ఎ కెరీర్” అనే ప్రచారాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, ఏపీలో గోడకూలి ఇద్దరు మృతి...
‘‘ UPA హయాంలో సాయుధ బలగాలు నిరాశకు గురయ్యాయి. 2009 నుంచి 2013 మధ్య 52,243 మంది సైనికులు ఆర్మీ నుండి అకాల రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పుడు UPA ప్రభుత్వం ‘ఆర్మీ యాజ్ ఎ కెరీర్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. కానీ వాస్తవం ఏంటంటే జాతీయవాద స్ఫూర్తిని అణిచివేసిన తరువాత ఎలాంటి ప్రచారాలు పని చేయవు ’’ అని అన్నామలై ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
అగ్నివీర్ పథకం కింద ఐఏఎఫ్ లో 3000 పోస్టులకు 7,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారని చిదంబరం ట్వీట్ చేశారు. ‘‘ యువతలో అగ్నిపథ్ బాగా ప్రచార్యం పొందిందని భావించడం చాలా తప్పు. కానీ నిజమేంటంటే దేశంలో నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అందుకే చాలా మంది యువకులు ఏ ఉద్యోగాన్ని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ’’ ఈ నేపథ్యంలోనే అన్నామలై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
సెక్స్ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అది అత్యాచారం కిందకు రాదు - కేరళ హైకోర్టు
దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సమూల మార్పును తీసుకొచ్చి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైనికులను రిక్రూట్‌మెంట్ చేయడానికి జూన్ 14వ తేదీన ఈ ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో నాలుగేళ్ల కాలానికి సైనికులను రిక్రూట్ చేసుకుంటారు. వీరిని అగ్నివీర్స్ అని పిలుస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మందిని 11.71 లక్షల ప్యాకేజీతో వెనక్కిపంపిస్తారు. వీరు పెన్షన్, గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలకు అర్హులు కారు.
ఈ పథకం పట్ల దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా ఆందోళనలు జరిగాయి. ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు రాష్ట్రాల్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. టైర్లను తగులబెట్టారు. రోడ్లపై కూర్చొని వాహనాలను నిలువరించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే రైలు పట్టాలపై కూర్చుకున్నారు. రైలు బోగీలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పంటించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత దిగివచ్చింది. అగ్నివీరులుగా పని చేసిన వారికి కేంద్ర సాయుధ బలాగాల్లో 10 శాతం కోటా కల్పిస్తామని చెప్పింది. పలు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర పరిధిలో జరిగే పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.