రుణాలపై మారటోరియం పొడిగించాలని కేంద్రానికి చెప్పలేం: సుప్రీం

By narsimha lodeFirst Published Mar 23, 2021, 11:31 AM IST
Highlights

ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని తాము కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.


న్యూఢిల్లీ: ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని తాము కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.మారటోరియం కాలం పొడిగించాలని చెప్పేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

గత ఏడాదిలో కరోనా లాక్‌డౌన్ సమయంలో రుణాలపై ఆర్బీఐ మారటోరియం విధించింది.మారటోరియం విధించిన కాలంలో వడ్డీపై వడ్డీమాఫీ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ నిర్వహించింది.కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఆర్ధిక విషయాల్లో న్యాయస్థానాలు కార్యనిర్వాహకులకు సలహదారులు కాదని సుప్రీం తెలిపింది.

ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు పూర్తి వడ్డీని చెల్లించాల్సి ఉన్నందున పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆర్ధిక విధానం అంటే ఏమిటి, ఆర్ధిక ప్యాకేజీ ఏమిటనేది సమగ్ర సంప్రదింపుల తర్వాత కేంద్రం,ఆర్బీఐ నిర్ణయిస్తాయని  కోర్టు తెలిపింది.కరోనా కాలంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము చెప్పలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

click me!