2019 లో దేశానికి నూతన ప్రధాని...సెకండ్ మీటింగ్ అమరావతిలోనే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Jan 19, 2019, 2:40 PM IST
Highlights

దేశంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో కుప్పకూలనుందని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు.ఈ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజలు కొత్త ప్రధానిని ఎన్నకోనున్నారన్నారు. బిజెపి అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోదీలను ప్రజలు వద్దనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

దేశంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో కుప్పకూలనుందని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు.ఈ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజలు కొత్త ప్రధానిని ఎన్నకోనున్నారన్నారు. బిజెపి అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని మోదీలను ప్రజలు వద్దనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా బ్రిగేడ్ మైదానంలో జరిగిన ఐక్య విపక్ష ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...  కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేయకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తమకు గత ఎన్నికల్లో ఇచ్చిన స్పెషల్ స్టేటస్ హామీని కూడా విస్మరించారని గుర్తుచేశారు. అందుకోసమే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్లు చంద్రబాబు వివరించారు. 

రాష్ట్రాలను సాయం చేయడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు.  అధికార బిజెపి పార్టీ దేశాన్ని విడదీయాలని చూస్తుంటే....తాము మాత్రం దేశాన్ని, ప్రజలకు కలపాలని చూస్తున్నామని అన్నారు. అందుకోసమే తామంతా ఒక్కతాటిపైకి వచ్చి ఇలా ఇక్కడ కలిశామని...తమ నినాదాలు సేవ్ ఇండియా, సేవ్ డేమోక్రసీలేనని చంద్రబాబు పేర్కొన్నారు.  
 
 ఐదేళ్ల క్రితం బిజెపి, ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. అయితే ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి విస్మరించింది. ఎన్నికల సమయంలో బిజెపి జన్ ధన్, మేక్ ఇన్ ఇండియా, ముద్రా లోన్స్ , స్వచ్చ భారత్, కరప్ట్ ప్రీ కంట్రీ, స్మార్ట్ సిటీస్, బ్లాక్ మనీ వెలికితీయడం, అచ్చే విన్, 2  లక్షల ఉద్యోగాలు వంటి హామీలిచ్చింది. కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యిందని...కొన్నింటిని అసలు అమలు చేయలేదని ఆరోపించారు.

ఇప్పుడున్న దేశ ప్రధాని నరేంద్ర మోది కేవలం పబ్లిసిటీ కోసమే తాపత్రయ పడతాయరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కానీ మనకు పేదల కోసం, సమాజం కోసం పచిచేసే ప్రధాని కావాలని అన్నారు. అందుకోసమే తాము ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 

బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలోని రైతులు మోసపోయారని అన్నారు. నాలుగేళ్లలో రైతుల  ఆదాయం రెండింతలు చేస్తామన్న కేంద్రం హామీ ఏమైందని ప్రశ్నించారు. వీరి హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువయయ్యాయని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు  గిట్టుబాటు ధరలు లభించక వారు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నారని....దేశంలో సగటు వ్యవసాయ వృద్దిరేటు శాతం కేవలం 1.9 శాతంగా వుందని చంద్రబాబు తెలిపారు.  

 సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం అందించి రాఫేల్ డీల్ కుంభకోణంలో తప్పదోవ పట్టించారని ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. ఈ విషయంలో దేశ  ప్రజలను, కోర్టును కూడా మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. 

 కాశ్మీర్, కర్ణాటకల విషయంలో కేంద్రం రాజకీయాలు చేస్తోందని...వీటిని మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే కేంద్రం భారీ మూల్యం చెల్లించుకుంటుందన్నారు. జంతువులను కొన్నట్లు ఎమ్మెల్యేలుగా కొనడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

దేశంలోని ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఇలా  పెద్ద సభ ఏర్పాటు చేయాలన్న మమతా  బెనర్జీ ఆలోచన చాలా బావుందన్నారు. తాము కూడా ఇలాంటి సభనే ఏపి రాజధాని అమరావతి నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.  
 

click me!
Last Updated Jan 19, 2019, 2:58 PM IST
click me!