వాంతులు చేసుకుంటుండగా.. తల తెగిపడింది

Published : Jan 19, 2019, 02:14 PM ISTUpdated : Jan 19, 2019, 02:22 PM IST
వాంతులు చేసుకుంటుండగా.. తల తెగిపడింది

సారాంశం

బస్సులో ప్రయాణిస్తూ.. ఓ మహిళ వాంతులు చేసుకుంటుండగా.. ఆమె తల తెగి పడిపోయింది. 

బస్సులో ప్రయాణిస్తూ.. ఓ మహిళ వాంతులు చేసుకుంటుండగా.. ఆమె తల తెగి పడిపోయింది. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం డైమండ్ క్రాసింగ్ సెంటర్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్న జిల్లాకు చెందిన ఆశారాణి అనే 56ఏళ్ల మహిళ ఆర్టీసీ బస్సులో పన్నా జిల్లాకు వెళుతోంది. బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఆమెకు వాంతులు అయ్యాయి. దీంతో ఆమె తన తలను బస్సు కిటికీలో నుంచి బయటకు పెట్టింది.

ఆ సమయంలో డ్రైవర్ బస్సును అతివేగంగా నడుపుతుండటంతో.. ఆమె తల కరెంట్ స్తంభానికి కొట్టుకుంది. ఆ దెబ్బకి తల తెగి కిందపడిపోయింది. మొండెం మాత్రం బస్సులోనే ఉండిపోయింది. వెంటనే డ్రైవర్ బస్సుని ఆపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవరన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !