
Under-Construction Bridge Collapses: బీహార్‌లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. బీహార్ లోని ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన మూడు వారాల తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మరో వంతెనలో కొంత భాగం కూలిపోయింది. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మేచీ నదిపై వంతెన స్తంభం కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఎన్ హెచ్-327ఈపై నిర్మాణంలో ఉన్న వంతెన పూర్తయిన తర్వాత కిషన్ గంజ్, కతిహార్ లను కలుపుతుందని అధికారులు తెలిపారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, కారణాలపై దర్యాప్తు చేయడానికి ఐదుగురు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పైలింగ్ ప్రక్రియలో మానవ తప్పిదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అధికారులు తెలిపారు. కాగా, జూన్ 4న, ఖగారియా జిల్లాను భాగల్‌పూర్‌తో కలిపే నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సెక్యూరిటీ గార్డు ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనకు 2019 నవంబర్ వరకు పూర్తిచేసే గడువు ఉన్నప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోవడంతో పెద్ద దుమారమే రేగింది. బీహార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో పూర్తయిన-నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలపై స్ట్రక్చరల్ ఆడిట్ అవసరాన్ని నొక్కి చెప్పింది.