ఆర్థిక‌ రాజ‌ధాని ముంబ‌యిలో దంచికొడుతున్న వాన‌లు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

Published : Jun 24, 2023, 04:19 PM ISTUpdated : Jun 24, 2023, 04:20 PM IST
ఆర్థిక‌ రాజ‌ధాని ముంబ‌యిలో దంచికొడుతున్న వాన‌లు.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

సారాంశం

Mumbai Rains: ఇప్పటికే వారం రోజులకు పైగా ఆలస్యమైన నైరుతి రుతుపవనాలు నగరంలోకి ప్రవేశించే అవకాశాల మ‌ధ్య  శనివారం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి, థానేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 26,27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 24 నాటికి రుతుపవనాలు ముంబ‌యిని తాకే అవకాశం ఉందని ఐఎండి ఈ వారం ప్రారంభంలో తెలిపింది.

Weather Update: దేశ ఆర్థిక రాజధాని ముంబ‌యిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం దంచికొడుతోంది. ఈ వాన‌ల‌తో ముంబ‌యి వాసులు మండుతున్న ఎండ‌లు, అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఉపశమనం పొందారు. అయితే, భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇప్పటికే వారం రోజులకు పైగా ఆలస్యమైన నైరుతి రుతుపవనాలు నగరంలోకి ప్రవేశించే అవకాశాల మ‌ధ్య  శనివారం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి, థానేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 26,27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 24 నాటికి రుతుపవనాలు ముంబ‌యిని తాకే అవకాశం ఉందని ఐఎండి ఈ వారం ప్రారంభంలో తెలిపింది.

సాధారణంగా ఆకాశం మేఘావృతమై ముంబ‌యి నగరం, శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ట్వీట్ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత క్రమంగా పెరుగుతుందని ముంబ‌యి ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న 5 రోజుల్లో తీవ్ర వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. రాయ్ గ‌ఢ్, థానే, ముంబయి, పాల్ఘర్ వైపు రుతుపవనాలు మరింతగా వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జూన్ 24 నాటికి రుతుపవనాలు ముంబైని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇదివ‌ర‌కు తెలిపింది. అరేబియా సముద్రంలో అతి పొడవైన తుఫానుగా మారిన బిపర్జోయ్ తుఫాను తర్వాత నైరుతి రుతుపవనాలు తన గమనాన్ని తిరిగి ప్రారంభించే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఐఎండీ రోజువారీ బులెటిన్ ప్రకారం, నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. విదర్భ, చత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాలు, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్త‌రించాయి. జూన్ 23 న జార్ఖండ్, బీహార్ లోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు విస్త‌రించ‌నున్నాయి. వచ్చే రెండు రోజుల్లో  ఛత్తీస్ గ‌ఢ్ లోని మరికొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్ లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్