
దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలోని వరి పొలాల్లో శనివారం ఉదయం ఒక పోలీసు మృతదేహం లభించింది. అయితే అతడిని ఉగ్రవాదులు కాల్చి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఫరూఖ్ అహ్మద్ మీర్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే అతడు ఆఫ్ డ్యూటీలో పాంపోర్‌లోని తన స్వగ్రామమైన సంబూరాలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి వరి పొలానికి బయలుదేరాడు. అయితే శనివారం తెల్లవారుజామున అతడి మృతదేహం కనిపించింది.
ఈ దేశాల్లో పుట్టిన ప్రతీ ఒక్కరూ సైన్యంలో చేరాల్సిందే.. ఎందుకంటే ?
ఫరూఖ్ అహ్మద్ మీర్ మృతదేహం పొలంలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అహ్మద్ మీర్ ఛాతీపై బుల్లెట్ గాయం ఉండటం పోలీసులు గుర్తించారు.
‘‘ఐఆర్‌పీ 23 బీఎన్‌లో పోస్ట్ అయిన సామ్, బూరా ఎస్‌ఐ (ఎం) ఫరూక్ అహ్మద్ మీర్ మృతదేహం అతడి ఇంటికి సమీపంలోని వరి పొలాల్లో కనిపించింది. అతడు నిన్న (శుక్రవారం)సాయంత్రం తన వరి పొలాల్లో పని కోసం తన ఇంటి నుండి బయలుదేరాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ ఉగ్రవాదులు పిస్టల్ ఉపయోగించి కాల్చి చంపారు ” అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
అమ్మ పుట్టిన రోజు.. బ్లాగ్ లో ప్రధాని మోదీ ఎమోషనల్..!
ఈ ఏడాది మిలిటెంట్ల చేతిలో హతమైన తొమ్మిదో పోలీసు మీర్. గతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మిగిలిన ఏడుగురిలో ఎక్కువగా వారు డ్యూటీలో లేని సమయంలోనే హత్యకు గురయ్యారు. వారిపై ఉగ్రవాదులు దాడి చేసి చంపేశారు. కాగా కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన లక్షిత దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదులంతా ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.