ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్.. ఆర్మీ మేజర్ అరెస్ట్

By telugu news teamFirst Published Mar 11, 2021, 8:38 AM IST
Highlights

ఆర్మీ మేజరును పూణే కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 15వతేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రశ్నపత్రం లీక్ కేసులో అతని బ్యాచ్ మేట్ అయిన మరో ఆర్మీ అధికారిని పోలీసులు గతంలో అరెస్టు చేశారు.

ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరో ఆర్మీ ఉన్నతాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఆర్మీ మేజర్ రిక్రూట్ మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారని ఢిల్లీ నుంచి పూణే పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఆర్మీ మేజరును పూణే కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 15వతేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రశ్నపత్రం లీక్ కేసులో అతని బ్యాచ్ మేట్ అయిన మరో ఆర్మీ అధికారిని పోలీసులు గతంలో అరెస్టు చేశారు.నిందితుడైన ఆర్మీ మేజర్ స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని ఇతరులకు పంపించాడని తేలింది.

నిందితుడు ఫోన్ ను నీళ్లలో పడేయడంతో దెబ్బతింది. దీంతో ఫోన్ డాటాను పునరుద్ధరించే పనిలో పోలీసులు పడ్డారు.పూణే కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నవేందర్ ఈ కేసులో నిందితుడైన ఆర్మీ మేజరును పోలీసు కస్టడీకి పంపించారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసును పూణే పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా దర్యాప్తు సాగిస్తున్నాయి.ఈ లీకేజీ బాగోతంలో మిలటరీ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే సంస్థలతోపాటు మాజీ సైనికులు, సైనికాధికారుల పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది.దీంతో ఇప్పటికే పోలీసులు 10 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!