Electric Scooter Catches Fire: మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంట‌లు.. ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డ‌ వాహ‌నదారుడు

Published : May 01, 2022, 01:03 AM IST
Electric Scooter Catches Fire: మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంట‌లు.. ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డ‌  వాహ‌నదారుడు

సారాంశం

Electric Scooter Catches Fire: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో ఓ ఎలక్ట్రిక్  బైక్ లో మంటలు చెలరేగాయి. వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఒక్కసారిగా.. మంటలు ఎగిసి ప‌డ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యజమాని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  

Electric Scooter Catches Fire:  దేశంలో పెట్రో ధ‌ర‌లు నిరంత‌రం పెరుగుతుండ‌టంతో చాలా మంది ఎల‌క్ట్రిక్  వాహ‌నాల కొనుగొలుకు మొగ్గు చూపుతున్నారు. కానీ, నిత్యం ఎదోక చోట ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు జ‌రుగుతునే  ఉన్నాయి. విద్యుత్ వాహనాల‌ బ్యాటరీలో మంటలు చెలరేగడం, ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలడం, చూస్తుండగానే త‌గ‌ల‌ప‌డిపోయ‌డం. నిమిషాల్లో ప్రాణాలు బలి తీసుకోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహిక‌ల్స్ పేరు చెప్పితేనే..ప్ర‌జ‌ల‌ గుండెల్లో వణకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

తాజాగా.. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో ఓ ఎలక్ట్రిక్  బైక్ లో మంటలు చెలరేగాయి. వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఒక్కసారిగా.. మంటలు ఎగిసి ప‌డ్డాయి.  దీంతో అప్ర‌మ‌త్త‌మైన బైకర్..  ఆపి మంటల నుంచి వాహనదారుడు తృటిలో తప్పించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు యత్నించినా ప్ర‌యోజ‌నం లేకపోయింది. వాహనం మంటల్లో దగ్దమైంది. ఇలాంటి ఘటనలతో ఎలక్ట్రిక్ టూవీలర్లు అంటేనే జనాలు భయపడిపోతున్నారు. వాటిని కొనాలంటే జంకుతున్నారు. ఇక విద్యుత్ వాహనం కొన్నవారు.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కంగారుపడుతున్నారు. ఈ బైక్ ఓనర్ ను సతీశ్ గా గుర్తించారు. సతీశ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఏడాది క్రితం..  i-Praise+ ను Okinawa అనే కంపెనీ  ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేశారు. దీనిపై బాధితుడు సిప్ కాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

తాజాగా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. గ‌త నెల మార్చిలో త‌మిళ‌నాడులోని వేలూరు జిల్లాలో ఓ తండ్రి, కూతురు ఎలక్ట్రిక్‌ బైక్ కు ఛార్జ్ పెడుతున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా బ్యాట‌రీ పేలింది. దీంతో భారీ స్థాయిలో పొగలు రావడంతో ఊపిరాడక మృతి చెందారు. తిరుచిరాపల్లి జిల్లా మనప్పారైలో విద్యుత్ ద్విచక్ర వాహనం మంటల్లో చిక్కుకుంది. అలాగే..ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో ఒక వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఛార్జీంగ్ పెట్టాడు. ఈ క్రమంలో వేరు చేయగలిగిన బ్యాటరీ పేలి మరణించాడు.
  
ఇదిలా ఉంటే.. ఈ నెలలో TNలోని అంబూర్‌లో ఓ వ్య‌క్తి త‌న ఎల‌క్ట్రిక్ వాహనం పనిచేయడం లేద‌ని ఫిర్యాదు చేసిన కంపెనీ సరైన సమయంలో సహాయం చేయకపోవడంతో విసుగు చెందిన వ్యక్తి తన ఈ-స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత వారం.. తెలంగాణలోని నిజామాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడి మరణానికి దారితీసిన బ్యాటరీ పేలుడుపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ప్యూర్ ఈవీ, నిజామాబాద్‌లో 2,000 వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు నిప్పంటించే సంఘటనల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘ‌ట‌న‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  నిర్లక్ష్యం గా వ్య‌వ‌హ‌రించే.. కంపెనీలకు జరిమానా విధించబడుతుందని, నిపుణుల బృందం నివేదిక వచ్చిన తర్వాత అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించారు. అనే విషయంపై విచారణకు ఏర్పాటు చేయబడింది. కేంద్రం  ప్ర‌మాణాలు పాటించ‌ని కంపెనీలకు జరిమానా విధించాలని యోచిస్తోంది. EV అగ్నిప్రమాదాల తర్వాత  2,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్యూర్ ఈవీ రీకాల్ చేసింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?