Char Dham Yatra 2022: చార్ ధామ్ యాత్రికుల‌కు ఊర‌ట‌..! ఇక‌పై ఆ స‌ర్టిఫికెట్ తప్పనిసరి కాదు..

Published : Apr 30, 2022, 11:26 PM IST
Char Dham Yatra 2022: చార్ ధామ్ యాత్రికుల‌కు ఊర‌ట‌..! ఇక‌పై ఆ స‌ర్టిఫికెట్ తప్పనిసరి కాదు..

సారాంశం

Char Dham Yatra 2022: హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే  చార్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ అడగబోమని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సంధు తెలిపారు.  

Char Dham Yatra 2022: హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే తీర్థ‌యాత్ర‌ల్లో ఉత్త‌రాఖండ్ చార్ ధామ్ యాత్ర ఒక‌టి. చార్ ధామ్ యాత్ర ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఈ యాత్రకు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌ని విష‌యం తెలిసింది. అయితే, ఈ ఏడాది ఊర‌ట నిచ్చింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. 

ఈ నేప‌థ్యంలో మే 3 నుండి ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు బయలుదేరే భక్తులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను కరోనా నెగిటివ్ రిపోర్ట్, టీకా సర్టిఫికెట్ అడగబోమని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సంధు తెలిపారు. 

అయితే.. పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని ప్రభుత్వం భక్తులందరూ తమ రాకకు ముందు పర్యాటక శాఖ నిర్వహిస్తున్న రాష్ట్ర పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరింది. రాష్ట్ర సరిహద్దులో రద్దీని నివారించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
 
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఉత్తరాఖండ్ పోలీసు చీఫ్, ఆరోగ్య, పర్యాటక శాఖల కార్యదర్శులు, మందిర సమితి అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్‌లతో సహా సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ సంధు అధ్యక్షతన సమావేశమయ్యారు. ఉత్తరాఖండ్ వెలుపలి నుండి వచ్చే ప్రయాణికులు మరియు యాత్రికుల కోవిడ్-19 పరీక్షలు అవసరమా అనే దానిపై స్పష్టత వచ్చింది.

చార్ ధామ్ యాత్ర సజావుగా జరిగేలా చూడాలని సంధు అధికారులను ఆదేశించారు . రాష్ట్రంలోని ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం..  ఇత‌ర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, భక్తులు కరోనావైరస్ కోసం పరీక్షలు చేయించుకోవడం లేదా టీకా ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి కాదని స్ఫ‌ష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇత‌ర‌ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు ప్రతికూల కోవిడ్ రిపోర్ట్ లేదా టీకా సర్టిఫికేట్ కోసం తనిఖీ చేయడం తప్పనిసరి కాదని సంధు తెలిపారు. 

భక్తులు రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. రాష్ట్ర సరిహద్దుల్లో రద్దీని నివారించేందుకు  ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం, పరిపాలన స్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని సంధు తెలిపారు. కాగా, మే 3న చార్‌ ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరుస్తారు. మే 6న కేదార్‌నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో సంబంధిత ఆంక్షలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సడలించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది హిమాలయ దేవాలయాలను సందర్శించే యాత్రికులు రికార్డు స్థాయిలో రావచ్చని అంచనా వేస్తున్నారు. 

కోవిడ్ -19 నియంత్రణలు ఎత్తివేయబడినందున ఈ సంవత్సరం అధిక సంఖ్యలో యాత్రికులు హిమాలయ దేవాలయాలను సందర్శిస్తారని భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లే మార్గంలో ఉన్న హోటళ్లు మరియు ధర్మశాలలు పూర్తిగా ముందుగానే బుక్ చేసుకున్నాయని పిటిఐ నివేదించింది. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !