వామ్మో.. ముంచుకొస్తున్న మరో తుఫాను.. డిసెంబర్ 13న దక్షిణ అండమాన్ లో ఏర్పడే అవకాశం

By team teluguFirst Published Dec 11, 2022, 1:01 PM IST
Highlights

మాండూస్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ఇంకా పూర్తిగా వెళ్లిపోకముందే దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. 

డిసెంబర్ 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 13-14 తేదీలలో అండమాన్, నికోబార్‌లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ మధ్య నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఓ నివేదిక సూచించింది. అయితే తుఫాన్‌గా మారే అవకాశం లేదు.

నేడు హిమాచల్ ప్రదేశ్ సీఎం స్వీకారం.. ఖర్గే, గాంధీలకు థ్యాంక్స్ చెప్పిన సుఖ్వీందర్ సుఖు

కాగా.. పొరుగున ఉన్న తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం రాత్రి 'మండౌస్' తుఫాను తీరాన్ని దాటిన తరువాత తాజా సమాచారం అందింది. మండౌస్ తుఫాను అవశేషాలు అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశించాయని ఐఎండీ ఆదివారం తెలియజేసింది. అల్పపీడన ద్రోణి (మాండూస్ తుఫాను అవశేషం) ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌ లో ఘోర ప్రమాదం... ఫ్లైఓవర్‌ను ఢీకొట్టి కిందపడ్డ బైక్‌.. దంపతులు మృతి, కుమార్తెకు గాయాలు

ఇదిలా ఉండగా.. మాండూస్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా.. ఈ తుఫాను వల్ల ఐదుగురు చనిపోయారు. వందలాది చెట్ల నేలకూలాయి. చెన్నైలో విద్యుత్ అంతరాయం కలిగింది.

ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు హామీ ఇవ్వనంత వరకు జ‌మ్మూకాశ్మీర్ అభివృద్ధి చెందదు: ఫరూక్ అబ్దుల్లా

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో 20.5, చిత్తూరులో 22, ప్రకాశంలో 10.1, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4, తిరుపతి జిల్లాలో 2.4, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో 13.2 మిల్లీ మీట‌ర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై సీఎం జగన్‌ శనివారం సమీక్ష నిర్వహించారు.నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

click me!