బీహార్ లో కూలిన మరో వంతెన.. ఒకే నెలలో ఇది మూడో ఘటన

Published : Jun 28, 2023, 03:04 PM IST
బీహార్ లో కూలిన మరో వంతెన.. ఒకే నెలలో ఇది మూడో ఘటన

సారాంశం

బీహార్ లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడో సారి. 

బీహార్ లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది. భారీ వర్షాల కారణంగా బీహార్ లో గంగా నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక పిపా వంతెనలో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటన రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ఎవరికీ గాయాలు కాలేదు.

ఆపరేషన్ థియేటర్ లో లాంగ్ స్లీవ్ స్క్రబ్ జాకెట్లు ధరించేందుకు అనుమతివ్వండి - ముస్లిం వైద్య విద్యార్థుల లేఖ

మూడు వారాల కిందట బీహార్ లోని భాగల్ పూర్ లో రూ.1700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అగువానీ-సుల్తాన్ జంగ్ వంతెన కుప్పకూలింది. సెక్యూరిటీ గార్డు ప్రాణాలను బలిగొన్న ఈ బ్రిడ్జి 2019 నవంబర్ లో ప్రారంభించాల్సి ఉండగా అది అసంపూర్తిగా ఉండిపోయింది. 

ఈ ఘటనపై బీహార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలను స్ట్రక్చరల్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 

బక్రీద్ రోజున బలివ్వడానికి బర్రెను తీసుకొస్తే.. ట్రక్కులో నుంచి దూకి, అందరినీ తొక్కుకుంటూ.. బీభత్సం.. వైరల్

కాగా.. జూన్ 24వ తేదీన కూడా కిషన్ గంజ్ జిల్లాలోని మరో వంతెనలో కొంత భాగం కూలిపోయింది. రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మేచీ నదిపై ఉన్న వంతెన స్తంభం కూలిపోయింది. నేషనల్ హైవే -327ఈ పై నిర్మాణంలో ఉన్న వంతెన పూర్తయితే కిషన్ జంగ్, కతిహార్లను కలిపేదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. అయితే బీహార్‌లో ఇలా వంతెనలు కూలడం కొత్తేమీ కాదు.. గతంలో ఇలా ఒకే ఏడాదిలో ఏడు ఘటనలు జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu