UP Assembly Election 2022: బీజేపీకి వరుస షాక్ లు.. పార్టీని వీడిన ఎమ్మెల్యే ముఖేష్ వర్మ

By SumaBala BukkaFirst Published Jan 13, 2022, 1:20 PM IST
Highlights

‘స్వామి ప్రసాద్ మౌర్య మా నేత. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా. మేం మద్దతు ఇస్తాం. రానున్న రోజుల్లో మరికొంతమంది మాతో చేరనున్నారు’ అని బీజేపీని వీడిన అనంతరం ముఖేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.షికోహాబాద్ ఎమ్మెల్యే అయిన ఆయన కూడా బీసీవర్గం నేతే. 

లక్నో : Uttarpradesh రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార BJPకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు వైదొలగగా.. తాజాగా మరో ఎమ్మెల్యే Mukesh Verma బీజేపీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన resign చేశారు. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న నిష్క్రమణల సంఖ్య ఏడుకు చేరుకుంది.

‘స్వామి ప్రసాద్ మౌర్య మా నేత. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా. మేం మద్దతు ఇస్తాం. రానున్న రోజుల్లో మరికొంతమంది మాతో చేరనున్నారు’ అని బీజేపీని వీడిన అనంతరం ముఖేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. షికోహాబాద్ ఎమ్మెల్యే అయిన ఆయన కూడా బీసీవర్గం నేతే. 

బీజేపీ సర్కారులో దళితులు, వెనకబడిన వర్గాలకు సముచిత న్యాయం జరగలేదంటూ స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ సీఎం yogi adityanath కేబినెట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముఖేష్ కూడా తన రాజీనామా లేఖలో అవే కారణాలను ప్రస్తావించారు. వీరంతా సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

కాగా, దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాలూ ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్ లో అయితే, అధికారం దక్కించుకోవాలని సమాజ్ వాదీ పార్టీ, జీజేపీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి దెబ్బ మీద బెబ్బ‌లు త‌గులుతున్నాయి. 

రాష్ట్ర బీజేపీ కీలకనేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు సైతం రాజీనామా చేయడంతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులు సహా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పడం కాషాయ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది. మరికొద్ది రోజుల్లో పార్టీని వీడే వారి సంఖ్య అధికంగా ఉండ‌నుంద‌ని రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. 

బీజేపీని వీడుతున్న మంత్రులు, కీల‌క నేత‌లు ఈ సారి ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. మ‌రికొంత మంది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారన్న వార్తలు కమలదళంలో గుబులు పుట్టిస్తున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే మున్ముందు యూపీ ముఖ్య‌మంత్రి క్యాబినెట్ తో పాటు ఆ బీజేపీని వీడే వారి సంఖ్య పెరుగుతుంద‌ని  ఓబీసీ నేత, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్  అన్నారు. ప్ర‌తిరోజు ఇద్ద‌రు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడుతార‌ని తెలిపారు. ఈ నెల 20 నాటికి ఏకంగా 18 మంత్రులు బీజేపీకి రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌ని  ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. 

click me!