మరో ఫ్లాట్.. మరో 20 కోట్ల నగదు.. బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పిత ఇంట్లో డబ్బు కట్టలు.. 3 కిలోల బంగారం

Published : Jul 27, 2022, 11:55 PM IST
మరో ఫ్లాట్.. మరో 20 కోట్ల నగదు.. బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పిత ఇంట్లో డబ్బు కట్టలు.. 3 కిలోల బంగారం

సారాంశం

పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితకు చెందిన మరో ఫ్లాట్‌లో మరో 20 కోట్ల నగదు బయటపడింది. సుమారు రూ. 2 కోట్ల విలువైన మూడు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితాకు చెందిన మరో ఫ్లాట్‌లో మరో 20 కోట్ల నగదు పట్టుబడింది. మూడు కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన నగదు రూ. 20 కోట్లు అని చెప్పారు. అయితే, బ్యాంకు అధికారులు కౌంటింగ్ మెషీన్లతో ఇంకా నోట్ల లెక్కింపు జరుపుతున్నట్టు మీడియా వర్గాలు తెలిపాయి.

గత వారం అర్పిత నివాసంపై ఈడీ తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత వారం అర్పిత నివాసంలో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో మొత్తంగా రూ. 23.22 కోట్లను సీజ్ చేశారు. తాజాగా, రూ. 20 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్టు జాతీయ మీడియా రాత్రి 11 గంటల వరరకు చెప్పాయి. అంతేకాదు, రూ. 2 కోట్ల విలువైన బంగారాన్నీ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు. దీంతో మొత్తంగా రూ. 45.22 కోట్ల డబ్బును ఈడీ సీజ్ చేసింది.

బెల్గరియాలోని అర్పితాకు మరో ఫ్లాట్ ఉన్నది. ఈడీ దర్యాప్తులో అర్పితా వెల్లడించిన ఆస్తుల ప్రకారం అధికారులకు ఈ విషయం తెలిసింది. ఈ గదిలో సోదాలు చేయాలని అనుకుంది. కానీ, ఆ గది తాళం చెవులు దొరకలేదు. దీంతో అధికారులు ఆ తాళం పగులగొట్టి లోనకు వెళ్లితే షాక్ అయ్యారు. గత వారంలో తాము రూ. 21 కోట్ల నగుదును సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, అర్పితాకు చెందిన మరో ఫ్లాట్‌లో రూ. 20 కోట్ల నగుదును దాచిపెట్టినట్టు పేర్కొన్నారు.

రూ. 20 కోట్ల నగదును ఈడీ అధికారులు బట్టబయలు చేసిన తర్వాత బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీలను శనివారం అరెస్టు చేశారు. పార్థ చటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల నియామకానికి డబ్బులు డిమాండ్ చేశాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. టీచర్ స్కాంకు చెందిన ఈ డబ్బులనే పార్థ చటర్జీ ఇలా దాచి పెట్టాడని చెబుతున్నారు. టీచర్ స్కామ్‌లో వచ్చిన అవినీతి సొమ్మును తన దగ్గర, మరొకరి దగ్గర పార్థ చటర్జీ దాచి పెట్టాడని, తమను ఆయన మిని బ్యాంకుల తరహాలో వినియోగించుకున్నాడని పేర్కొన్నారు. ఈ గదులకు ఆయనకు సంబంధించిన కొందరు నమ్మకస్తులకే ప్రవేశం ఉండేదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !