అన్నపూర్ణి అరసు.. అప్పట్లో వివాహేతర సంబంధంతో వార్తల్లోకి.. కట్ చేస్తే.. నేడు మాతగా దర్శనం..ఎలాగంటే...

Published : Aug 15, 2022, 02:20 PM IST
అన్నపూర్ణి అరసు.. అప్పట్లో వివాహేతర సంబంధంతో వార్తల్లోకి.. కట్ చేస్తే.. నేడు మాతగా దర్శనం..ఎలాగంటే...

సారాంశం

తమిళనాడులో వార్తల్లోకి ఎక్కి వైరల్ గా మారిన అన్నపూర్ణి అరసు మాత.. ఇప్పుడు మరోసారి వార్తల్లో ఎక్కారు. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్ కు దొరికారు.   

తిరువన్నామలై : అన్నపూర్ణి అరసు. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. ఆవిడే నండీ తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన స్వప్రకటిత ఆది పరాశక్తి. మరో మహిళ భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ‘బతుకు జట్కా బండి’ లాంటి షోకు వెళ్లిన ఈవిడ.. ఆ తర్వాత మాతగా అవతారమెత్తి వార్తల్లోకి ఎక్కింది. ఈవిడకు ప్రత్యేకంగా ఇప్పుడు  ఒక ఆశ్రమం కూడా ఉంది. భక్త బృందం కూడా ఉంది. తాజాగా అన్నపూర్ణి అరసు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 14న ఆవిడ తన ఆశ్రమంలో తన భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఏకంగా అమ్మవారి గెటప్ లో తలపై కిరీటం ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో దీవిస్తూ  ఆవిడ కనిపించేసరికి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆవిడ అమ్మవారి మాదిరిగా కంఠహారం కూడా ధరించారు. అంతేకాదు.. ఆమె మెడలో కలువ పూల దండ కూడా ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే.. అచ్చం అమ్మవారిలాగే అలంకారం చేసుకుని అన్నపూర్ణి అరసు తన భక్తులకు దర్శనమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీమ్స్, ట్రోల్స్, ఓ రేంజ్లో పేలుతున్నాయి. ఈవిడ ఇలా ప్రత్యేక దర్శనాలే కాదు, ఒక యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి అందులో ఆధ్యాత్మికతను కూడా బోధిస్తున్నారు. తిరువన్నమలై జిల్లాలోని కిల్పెన్నతూరు సమీపంలోని రాజతోపు ప్రాంతంలో ఈవిడ ఆశ్రమం ఉంది. కుటుంబ సమస్యలకు, మానసిక సమస్యలకు, పెళ్లి సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆవిడ అనుగ్రహంతో పరిష్కారం దొరుకుతుందని అన్నపూర్ణి భక్తబృందం ప్రకటనలు కూడా ఇచ్చి అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

Har Ghar Tiranga : జాగ్వర్ కారుకు జెండా రంగులు వేసి.. వినూత్న రీతిలో దేశభక్తి చాటిన వ్యక్తి.. వీడియో వైరల్..

అసలు ఈ అన్నపూర్ణి మాత నైవేద్యం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ‘బాబోయ్.. ఇలా కూడా ఉంటారా?’ అని ముక్కున వేలేసుకుంటారు. సల్వాతెల్లెమ్ ఉన్మై అనే ఆలుమగల తగువులు తీర్చే షోలో భర్తకు దూరంగా, ప్రియుడికి దగ్గరగా ఉన్నా‘అన్నపూర్ణి’ ఆ షోలో కన్నీటి పర్యంతం అయ్యింది. మరో మహిళ భర్తతో వివాహేతర సంబంధం నడిపిన ‘అన్నపూర్ణి’ షోలో పాల్గొన్న వీడియో ఆప్పట్లో వైరల్ అయింది. ఇలాంటి మహిళా మాతగా మారి భక్తులను దీవించడం ఏంటని నెటిజన్ల నుంచి  తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. గంగ ‘చంద్రముఖి’గా మారినట్టుగా అన్నపూర్ణి’గా మారడంతో ఆమెకు కొందరు భక్తులు కాళ్లపై పడి పొర్లుదండాలు కూడా పెట్టారు. ఆ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఆ వీడియోలను ఎడిట్ చేసి మీమ్స్ పేజీల్లో తెగ నవ్వులు కురిపిస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?