ప్రయాగరాజ్ మహాకుంభ 2025లో సన్యాసులI జంతుప్రేమను ప్రదర్శిస్తున్నారు. . సాధువులకు ఈ జంతువులే కుటుంబ సభ్యులుగా మారిపోయాయి.
ప్రయాగరాజ్ మహా కుంభమేళా ; ప్రయాగరాజ్‌లోని సంగమ తీరంలో జరుగుతున్న మహా కుంభమేళాలో జంతుప్రేమ వెల్లివిరిసింది. కుంభమేళా ప్రాంతంలోని అఖాడా సెక్టార్‌లో నాగ సన్యాసుల శిబిరంలో వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నారు. సర్వస్వాన్ని త్యజించిన సన్యాసుల కూడా ఇక్కడ జంతుప్రేమను ప్రదర్శిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.
మహా కుంభనగరిలోని అఖాడాల శిబిరాలకు సన్యాసుల రాక ప్రారంభమైంది. దేశ నలుమూలల నుండి వచ్చే సాధకులు, సన్యాసులు ఇక్కడ కనిపిస్తున్నారు. వీరిలో కొందరు తమ జంతు ప్రేమతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
undefined
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన మహంత్ శ్రవణ్ గిరి ఒక చేతిలో భగవాన్ గణేష్ జపమాల, మరో చేతిలో కుక్కపిల్లను లాలిస్తూ కనిపించారు. ఈ కుక్కపిల్ల లాలీ వారికి కేవలం జంతువు కాదట... వారి సాధనలో ఒక భాగమట. ఈ విషయాన్ని మహంత్ శ్రవణ్ గిరి తెలిపారు. ఆయన మాటల ప్రకారం 2019 కుంభమేళాలో ప్రయాగరాజ్ నుండి కాశీ వెళ్తుండగా లాలీ దొరికిందట. రెండు నెలల లాలీ అప్పటి నుండి వారితోనే ఉందని తెలిపారు. వారు సాధన చేస్తున్నప్పుడు లాలీ శిబిరం బయట కాపలా కాస్తుంది...అంతేకాదు లాలీకి హెల్త్ కార్డ్ కూడా చేయించారు... దీని ద్వారా ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు.
మహా కుంభంలోని అఖాడా సెక్టార్‌లో మహంత్ శ్రవణ్ గిరి ఒక్కరే జంతు ప్రేమికులు కాదు.. మరికొందరు కూడా వున్నారు. ఇలా గురుగ్రామ్‌లోని ఖేతాబాస్ ఆశ్రమం నుండి మహాకుంభకు వచ్చిన జూనా అఖాడకు చెందిన శ్రీ మహంత్ తారా గిరి తమ పెంపుడు కుక్క సోమాతో కలిసి అఖాడాలో కనిపించారు
మహంత్ తారా గిరి చెప్పినదాని ప్రకారం... సోమవారం నాడు ఈ కుక్క పుట్టింది కాబట్టి దానికి సోమా అని పేరు పెట్టారట. సోమాను మహంత్ తారా గిరి శిష్యురాలు పూర్ణగిరి చూసుకుంటుందట. సాధు సన్యాసులకు కుటుంబం, పిల్లలు ఉండరు కాబట్టి సోమా వంటి పెంపుడు జంతువులనే వారు తమ సంతానంగా భావిస్తారు. సోమా కూడా వారిలాగే తిలకం దిద్దుకుంటుంది, జడలు వేసుకుంటుంది. సోమా కూడా పూర్తిగా సాత్విక ఆహారం తింటుంది. తాను సాధనకు సిద్ధం కావడానికి పట్టే సమయం కంటే సోమాను అలంకరించడానికి ఎక్కువ సమయం పడుతుందని తారాగిరి స్వామి శిష్యురాలు పూర్ణగిరి తెలిపారు.