చంద్రబాబుతో చర్చలు: ఢీల్లీ పీఠంపై రాహుల్ గాంధీ ప్లాన్ ఇదే

Published : May 09, 2019, 04:58 PM ISTUpdated : May 09, 2019, 05:19 PM IST
చంద్రబాబుతో చర్చలు: ఢీల్లీ పీఠంపై  రాహుల్ గాంధీ ప్లాన్ ఇదే

సారాంశం

ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత  అవలంభించిన వ్యూహంపై 21 రాజకీయ పార్టీలు ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నాయి

న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత  అవలంభించిన వ్యూహంపై 21 రాజకీయ పార్టీలు ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు భేటీ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై చంద్రబాబునాయుడు రాహుల్ కు ఓ నివేదిక ఇచ్చారు. సుమారు వందకు పైగా ఎంపీ సీట్లు గతంలో కంటే బీజేపీకి తక్కువగా వచ్చే అవకాశం ఉందని బాబు రాహుల్ కు నివేదిక ఇచ్చారు.

ఈ నివేదిక ఆధారంగా వ్యూహన్ని అనుసరించాలని బాబు రాహుల్ కు సూచించారు. ఎన్నికల తర్వాత తమ మధ్య పొత్తు కుదిరినట్టుగా ఓ లేఖను ఈ నెల 21న జరిగే సమావేశంలో ఈ పార్టీలు ఫైనల్ చేసే అవకాశం ఉంది.

తమ కూటమికి మెజారిటీ స్థానాలు దక్కితే తమ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని  ఈ పార్టీలు రాష్ట్రపతికి లేఖను ఇవ్వనున్నారు. గతంలో గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు అనుసరించిన విధానాలను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరో వైపు కోర్టు తీర్పులను కూడ ప్రస్తావించే ఛాన్స్ లేకపోలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి కంటే ఒక్క సీటు ఎక్కువగా  21 పార్టీల కూటమికి వచ్చినా కూడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు.


 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో