ఇది వన్డే జమానా: ఖర్గేకు అనంత కుమార్ రిప్లై

Published : Jul 20, 2018, 01:07 PM IST
ఇది వన్డే జమానా: ఖర్గేకు అనంత కుమార్ రిప్లై

సారాంశం

కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.శుక్రవారం సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానంపై చర్చకు పార్టీలకు కేటాయించన సమయం సరిపోదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

పార్టీలకు సమయ పరిమితి పెట్టవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షాలు ఏం అడగబోతున్నాయి, ప్రభుత్వం సభలో ఏం  చెప్పబోతోందనే విషయాలపై ఉత్కంఠ కొనసాగుతోందని, అందువల్ల పార్టీలకు కాల పరిమితి పెట్టవద్దని అన్నారు. ప్రతిపక్షాలు చెప్పదలుచుకున్నదాన్ని చెప్పానివ్వాలని ఆయన కోరారు.
 
మల్లికార్జున్ ఖర్గే వాదనకు కేంద్రమంత్రి అనంత్‌కుమార్ సమాధానం ఇచ్చారు. ఇది వన్డే క్రికెట్ జమానా అని, సుదీర్ఘమైన సమయం కోరడం సరికాదని అన్నారు. కచ్చితంగా కాల పరిమితి ఉండాల్సిందేనని, ఎవరు ఎంత మాట్లాడుతారో భగవంతుడు మాత్రమే తేల్చగలడని మంత్రి వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu