
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఓ యువకుడు చేసిన పనికి ఫిదా అయ్యారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోను twitterలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే.. ఆనంద్ మహీంద్ర social mediaలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ యువకుడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ప్రజలు క్రమంగా తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెడుతూ.. కొత్త కొత్ పరికరాలు ఆవిష్కరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే... Anand Mahindra పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు ప్లాస్టిక్ పైపులు, దారం, ప్లాస్టిక డబ్బాను ఉపయోగించి చెట్టుకున్న కాయలు తెంపే ఆసక్తికరమైన పరికరాన్ని తయారు చేయడాన్ని మనం చూడొచ్చు. ప్లాస్టిక్ డబ్బాను వెనక భాగంలో కట్ చేసి, దానికి క్రమ పద్ధతిలో తాడును బిగించి.. పైపుల సహాయంతో ఈజీగా జామ కాయలు తెంపే దృశ్యాలు మనకు వీడియోలో కనిపిస్తాయి.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 19న పదినిమిషాల్లో ఫుడ్ డెలివరీ అనే అంశంమీద ఆనంద్ మహీంద్రా స్పందించారు. అది అమానవీయం అంటూ చేసిన ట్వీట్ ను సమర్థించారు. ఆ తరువాత గంటలోనే మనసు మార్చుకున్నారు. కరోనా పుణ్యమా అని ఇటీవలికాలంలో Food, grocery delivery కంపెనీలకు ఆదరణ పెరిగింది. అదే సమయంలో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. ఇందులో భాగంగా పది నిమిషాల్లోనే డెలివరీ అనే కొత్త స్లోగన్ నూ అందుకున్నాయి.
తొలుత నిత్యావసర వస్తువులకే పరిమితమైన ఈ విధానం ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్ అయిన Zomato సైతం అందిపుచ్చుకుంది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రముఖ వ్యాపారవేత్త Anand Mahindra సైతం నెటిజన్లకు శ్రుతి కలిపారు. 10 నిమిషాల్లో డెలివరీ గురించి తన అభిప్రాయం తెలుపుతూ టాటా మెమోరియల్ డైరెక్టర్ సిఎస్ ప్రమేష్ మొదట tweet చేశారు. 10 నిమిషాల్లో నిత్యావసరాల డెలివరీ అనేది అమానవీయం, దీనివల్ల డెలివరీ బాయ్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని అందులో పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు పదినిమిషాల్లో చేరకపోతే ఏమీ అయిపోదు అని, ఇలాంటివి ఆపాలని కోరుతూ ఆయా సంస్థలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ విషయంలో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ తరువాత గంట సేపటికి నిత్యవసర వస్తువులను డెలివరీ చేసే జెప్టో సంస్థ వ్యవస్థాపకుడు ఆదిత్ పలిచా దీనిపై స్పందించారు. 10 నిమిషాల్లో డెలివరీపై తనదైన వివరణ ఇస్తూ ఆనంద్ మహీంద్రాను టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.10 నిమిషాల డెలివరీ అనేది దూరానికి సంబంధించినదే తప్ప వేగానికి సంబంధించినది కాదని చెప్పారు. సగటున 1.8 కిలోమీటర్ల దూరం నుంచే జెప్టో ఈ సేవలను అందిస్తోంది అని, కాబట్టి పది నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయడం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. అందుకే సగటున జరిగే రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే జప్టోలో రోడ్డు ప్రమాదాల రేటు తక్కువేనని చెప్పుకొచ్చారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.
మరో కోణంలో చూసినప్పుడు ఇది న్యాయంగానే అనిపిస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జప్టో వ్యవస్థాపకుడు సమాధానంతో ఆనంద్ మహీంద్రా సంతృప్తి చెందినట్లు కనిపించినా.. నెటిజన్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్యాకింగ్, బిల్డింగ్, అడ్రస్ వెతకడానికి పదినిమిషాలు సరిపోతుందా? అని పలిచాను నిలదీశారు. ప్రమాదాల గురించి ప్రస్తావించడంపైనా మండిపడుతున్నారు.