ఆడిడాస్ తమ్ముడు అజిత్ డాస్... మహేంద్ర ట్వీట్ వైరల్..!

Published : Nov 23, 2022, 10:37 AM ISTUpdated : Nov 23, 2022, 10:39 AM IST
ఆడిడాస్ తమ్ముడు అజిత్ డాస్... మహేంద్ర ట్వీట్ వైరల్..!

సారాంశం

ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇంకేముంది అది కాస్త వైరల్ గా మారింది.

ఏదైనా ఫేమస్ బ్రాండెడ్ వస్తువు ఉంటే.... దాని పేరుని కాస్త అటో, ఇటో మార్చి... మన కంటికి అంత స్పష్టంగా కనిపించకుండా... చిన్న చిన్న మార్పులు చేసి ఫేక్ వస్తువులను అమ్మేస్తూ ఉంటారు. ఇది ఓ బిజినెస్ టెక్నిక్. మనం కూడా... దానిని సరిగా చూసుకోకుండా... బ్రాండెడ్ వస్తువే ధర తక్కువకు లభ్యమౌతోంది కదా అని కొనేస్తూ ఉంటాం. తాజాగా... ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అది కాస్త ... ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన.. దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇంకేముంది అది కాస్త వైరల్ గా మారింది.


ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...ఆనంద్ మహీంద్రా  ఓ వ్యక్తి కాలికి ఉన్న షూస్ ని షేర్ చేశారు. ఆ షూని చూస్తే... అచ్చం ఫేమస్ బ్రాండెడ్ అడిడాస్  సంస్థకు కు సంబంధించినట్లుగానే ఉంది. కంపెనీ లోగో సైతం అలానే ఉంది. అయితే పేరును గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. అడిడాస్ స్థానంలో అజిత్‌దాస్‌ అని ఉంది. ఈ ఫొటోను షేర్‌ చేసిన ఆనంద్‌..... ఆడి తమ్ముడు అజిత్ అంటూ ఫన్నీ గా కామెంట్ చేశారు. వసుదైక కుటుంబం అంటూ కామెంట్ చేశారు.

నెటిజన్ల నుంచి రియాక్షన్ కూడా అంతే ఫన్నీగా రావరడం గమనార్హం. సేమ్ అలాంటి మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తుండటం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం