96ఏళ్ల బామ్మ..మార్కులు.. 98/100

Published : Nov 01, 2018, 04:34 PM ISTUpdated : Nov 01, 2018, 04:36 PM IST
96ఏళ్ల బామ్మ..మార్కులు.. 98/100

సారాంశం

ప్రస్తుతం ఈ బామ్మ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.. అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సాధించాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది ఓ 96ఏళ్ల బామ్మ.  ఇంతకీ ఆమె ఏం సాధించింది అనుకుంటున్నారా..? సెంచరీకి దగ్గరపడుతున్న సమయంలో.. ఆమె పరీక్షలు రాసి నూటికి 98మార్కులు సాధించింది. ఎప్పటి నుంచో చదువుకోవాలనే తన కోరికను తీర్చుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా కేరళ ప్రభుత్వం ‘‘అక్షర లక్ష్యం ’’అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అలప్పుజ జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ(96) చదువు నేర్చుకోవాలనే లక్ష్యంతో అక్షర లక్ష్యం కార్యక్రమంలో చేరింది. ఈ కోర్సులో భాగంగా చదవడం, రాయడం, గణితం నేర్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ఇటీవలే పరీక్షలు నిర్వహించారు. కార్తియాని అమ్మ కూడా పరీక్ష రాయగా.. 100కు 98 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. 

 

అయితే.. ఈ పరీక్షల్లో తాను ఎవరిదాంట్లోనూ కాపీ కొట్టలేదని.. తన పేపర్ చూసే చాలా మంది కాపీ కొట్టారని చెప్పుకొచ్చింది. బాగా చదవి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన తనకు చిన్నప్పుడు ఉండేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మాత్రం కంప్యూటర్స్ కోర్సు నేర్చుకుందామనుకుంటున్నట్లు వివరించింది. 

కాగా.. ప్రస్తుతం ఈ బామ్మ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో.. అందరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ బామ్మతో పాటు 
 42 వేల మందికి పైగా ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించారు.

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి