చక్కర్లు కొడుతూ పొలంలో దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్.. ఏమైందంటే ?

Published : Oct 01, 2023, 12:40 PM ISTUpdated : Oct 01, 2023, 12:44 PM IST
చక్కర్లు కొడుతూ పొలంలో దిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్.. ఏమైందంటే ?

సారాంశం

భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలోని ఓ పొలంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ హెలికాప్టర్ కు సహాయం చేసేందుకు ఘటనా స్థలానికి మరో హెలికాప్టర్ చేరుకుంది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్ హెచ్ ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఏఎల్ హెచ్ ధృవ్ రకానికి చెందిన ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యల తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా దానిని ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.

అయితే ల్యాండింగ్ కారణమైన సాంకేతిక సమస్యలను అంచనా వేయడానికి, వాటిని పరిష్కరించడానికి ఒక బృందాన్ని ప్రదేశానికి 
భారత వైమానిక దళం పంపించింది. ఈ పరిణామం చోటు చేసుకున్న సమయంలో హెలికాప్టర్ లో ఆరుగురు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు, భారత వైమానిక దళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఐఏఎఫ్ కు చెందిన ఏఎల్ హెచ్ ఎంకే 3 హెలికాప్టర్ భోపాల్ నుంచి చకేరికి రొటీన్ ట్రైనింగ్ మిషన్ లో భాగంగా బయలుదేరింది. అయితే ఉదయం 8 గంటలకు భోపాల్ 50 కిలోమీటర్ల దూరంలో బెరాసియాలోని దుంగారియా డ్యామ్ సమీపంలో పలుమార్లు చక్కర్లు కొట్టింది. చివరికి డ్యామ్ సమీపంలో ఉన్న ఓ పొలంలో ల్యాండ్ అయ్యింది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు. హెలికాప్టర్ కు సాంకేతిక సహకారం అందించేందుకు భారత వైమానిక దళం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

అందులో భాగంగా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మరో హెలికాప్టర్ ఘటనాస్థలికి చేరుకుంది. భోపాల్ నుంచి ఝాన్సీ వెళ్తున్న ఈ భారత వైమానిక దళ హెలికాప్టర్ ఇంజనీర్లను, సాంకేతిక బృందాన్ని ఘటనా స్థలానికి తరలించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా.. భారత వైమానిక దళం తన 91వ వార్షికోత్సవాన్ని భోపాల్ లో శనివారం నిర్వహించింది. ఇందులో ఆకట్టుకునే వైమానిక ప్రదర్శనలు ఇచ్చింది. ఈ కార్యక్రమం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్’ పేరుతో నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్, ఎస్యూ-30 ఎంకేఐ, మిరాజ్-2000 సహా ఐఏఎఫ్ విమానాల శ్రేణిని ప్రదర్శించారు. ఫ్లైయింగ్ స్కిల్స్, ఏరోబ్యాటిక్స్ అద్భుత ప్రదర్శన భారత వైమానిక దళం పరాక్రమాన్ని, సామర్థ్యాలను చాటిచెప్పింది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్