నిజాయితీ చాటుకున్న శ్రీలంక తమిళ శరణార్థి.. రోడ్డుపై దొరికిన రూ. 40 వేలను తిరిగి ఇచ్చిన మహిళ..

Published : Oct 31, 2022, 12:19 PM IST
నిజాయితీ చాటుకున్న శ్రీలంక తమిళ శరణార్థి.. రోడ్డుపై దొరికిన రూ. 40 వేలను తిరిగి ఇచ్చిన మహిళ..

సారాంశం

శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడులో శరణార్థులుగా ఉంటున్న ఓ మహిళ తనకు రోడ్డుపై దొరికిన రూ.40 వేలను పోలీసులకు అప్పగించింది. పోలీసులు విచారణ జరిపి ఆ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తిని వాటిని అందించారు. ఆ మహిళను అభినందించారు. 

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని పునరావాస శిబిరంలో నివసిస్తున్న శ్రీలంక తమిళ శరణార్థి తన నిజాయితీని చాటుకుంది. సిటీలో ఉన్న సత్యమంగళం బస్టాండ్ సమీపంలో రోడ్డుపై దొరికిన రూ.40,000 తిరిగి పోలీసులకు అప్పగించింది. 

భయానక వీడియో.. సీసీటీవీలో రికార్డైన గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదం.. బ్రిడ్జి ఎలా కూలిందంటే..

వివరాలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరి అనే 55 ఏళ్ల శరణార్థి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఆమెకు ఓ పార్శిల్ కనిపించింది. అందులో డబ్బు ఉన్నట్టు గుర్తించారు. దీంతో దానిని ఎలాగైనా పోగొట్టుకున్న వారికి అందించాలని భావించారు. దీని కోసం ఆమె గోకుల్ అనే 21 ఏళ్ల యువకుడి సాయం తీసుకున్నారు. అతడి ద్వారా సత్యమంగళం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. 

కుక్కపై అత్యాచారం చేసిన డెలివరీ బాయ్, నిందితుడి అరెస్ట్...

రోడ్డుపై వెళ్తుంటే తనకు డబ్బు దొరికిందని చెప్పారు. ఆ డబ్బు లభించిన తీరు, అడ్రెస్ వంటి పలు వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే రుజువులు చూపెట్టి వాటిని తీసుకెళ్లాలని లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ను షేర్ చేశారు. 

అల్బేనియాలో చిక్కుకున్న లక్నో వ్యాపారవేత్త.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు.. ఆందోళనలో కుటుంబం

దీనిని గమనించిన 61 ఏళ్ల మిఠాయి వ్యాపారి జాషువా పోలీసులను ఆశ్రయించారు. తన స్నేహితుడి అయిన గుణసింహం దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. దానిని పోగొట్టుకున్నానని పోలీసులతో పేర్కొన్నారు. తన కూతురు గర్భిణిగా ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు అవసరమై అప్పు చేశానని పేర్కొన్నారు. అతడు చెప్పిన వివరాలను తెలుసుకున్న పోలీసులు నిజా నిజాలు ఏంటని విచారించారు. గుణసింహం చెప్పిన వివరాలు నిజమే అని నిర్ధారించుకున్న పోలీసులు శనివారం డబ్బును జాషువాకు అందజేశారు. అనంతరం పోలీసులు  రాజేశ్వరి, గోకుల్‌ల నిజాయితీకి మెచ్చి సత్కరించారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు