ఆర్ఆర్ఆర్ కి గ్లోబల్ గ్లోబ్స్ అవార్డు.... అమూల్ స్పెషల్ డూడుల్..!

Published : Jan 13, 2023, 10:27 AM IST
ఆర్ఆర్ఆర్ కి గ్లోబల్ గ్లోబ్స్ అవార్డు.... అమూల్ స్పెషల్ డూడుల్..!

సారాంశం

తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇండియన్ సినిమా ఖ్యాతిని మరింత పెంచేలా తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఈ అవార్డు దక్కింది. 'అవార్డు గోస్ టూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు' అని ప్రకటించగానే తెలుగు ప్రజలంతా ఆనంద పడ్డారు. తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

కాగా.. తాజాగా...ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ తమదైన రీతిలో సెలబ్రేషన్ పార్టీలో చేరింది. ప్రధాన నటులు Jr NTR, రామ్ చరణ్ , సంగీత దర్శకుడు MM కీరవాణి ఫోటోలతో ఒక స్వీట్ డూడుల్‌ను బ్రాండ్ షేర్ చేసింది. డూడుల్‌లో, అమూల్ టీమ్‌కి RRR, ‘రియల్లీ రిమార్కబుల్ రివార్డ్’ని ప్రదానం చేసింది.

ఆ డూడుల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అచ్చం నాటు నాటు పాట డ్యాన్స్ వేస్తున్నట్లుగా ఉన్నారు. ఇక కీరవాణి.. ఆ అవార్డు అందుకుంటూ వారి మధ్య నిలపడటం విశేషం. ఈ డూడుల్.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

PREV
click me!

Recommended Stories

Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu