
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ అరెస్టుపై ఆయన తల్లి బల్విందర్ కౌర్ తొలిసారిగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా కొడుకు ఒక వీరుడిలా లొంగిపోయాడు’ అని పేర్కొన్నారు. ‘నా కొడుకు సరెండర్ అయినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాం. నా కొడుకు ఒక వీరుడిలా లొంగిపోవడంపై నాకు గర్వంగా ఉన్నది. మేం న్యాయపరమైన పోరాటం చేస్తాం. త్వరలోనే ఆయనను కలుస్తాం’ అని తెలిపారు.
అమృత్‌పాల్ తండ్రి తర్సేమ్ సింగ్ కూడా స్పందించారు. టీవీలో వార్తలు చూసిన తర్వాతే తమకు అమృత్‌పాల్ అరెస్టు అయినట్టు తెలిసిందని వివరించారు. ఆయన కుటుంబంతో కాంటాక్ట్‌లో లేడని తెలిపారు. తన కొడుకు డ్రగ్స్ భూతాన్ని అరికట్టడానికి పోరాడారని పేర్కొన్నారు. తన కొడుకు అనుకున్న లక్ష్యాన్ని సింగ్ సంఘట్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
Also Read: నెల కిందే అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేవాళ్లం.. కానీ..: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు
‘మీడియాలో వచ్చిన అమృత్‌పాల్ సింగ్ ఫొటోలు స్పష్టంగా లేవు. ఆయన ఈ రోజుకి కూడా సిక్కుల సంప్రదాయ వస్త్రాలనే ధరించారు. పంజాబ్ పోలీసులు వేధించిన ప్రతి ఒక్కరి తరఫునే తాను ఉన్నట్టు తెలిపారు.