వచ్చే ఎన్నికల్లో మోదీ మూడోసారి ప్రధాని అవుతారు: అమిత్ షా

Published : May 26, 2023, 01:55 AM IST
వచ్చే ఎన్నికల్లో మోదీ మూడోసారి ప్రధాని అవుతారు: అమిత్ షా

సారాంశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అస్సాం పర్యటన సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని, అలాగే కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు  తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఈ చర్యను "చౌక రాజకీయం" అని అభివర్ణించారు. ప్రజలు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, రెండుసార్లు భారీ మెజారిటీ ఇచ్చారనీ, అలాగే.. 2024 ఎన్నికలలో 300 సీట్లకు పైగా గెలిచి మూడవసారి ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

అస్సాం రాష్ట్రంలో హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మే 28న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని, అయితే కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయని మండిపడ్డారు.

"కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రతికూలంగా ఉందనీ, కాంగ్రెస్,దాని భాగస్వామ పార్టీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన అమిత్‌ షా.. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలన్న సాకు చూపుతున్నారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించిన "భూమి పూజ" కార్యక్రమాలకు గవర్నర్‌ను ఆహ్వానించని ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల నుండి అనేక ఉదాహరణలను ఆయన ఉదహరించారు. 

కొత్త రాష్ట్ర అసెంబ్లీ భూమి పూజ చేసినప్పుడు అప్పటి ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ను ఆహ్వానించలేదని, కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ , రాహుల్‌గాంధీలను ఆహ్వానించారని చెప్పారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం, అస్సాంలో తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మణిపూర్‌లో మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  కాంగ్రెస్, ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో కొత్త అసెంబ్లీ భవన ప్రారంభోత్సం సందర్బంగా ఆయా పార్టీలు గవర్నర్‌లకు బదులు ఆయా ముఖ్యమంత్రులు, సోనియా, రాహుల్‌గాంధీ వంటి నేతలు శంకుస్థాపన చేసిన సందర్భాలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. 

ప్రధానిని పార్లమెంటు లోపల మాట్లాడేందుకు కాంగ్రెస్ అనుమతించడం లేదని షా ఆరోపించారు. భారత ప్రజలు మోదీకి మాట్లాడే ఆదేశం ఇచ్చారు. ప్రధానమంత్రిని గౌరవించకపోవడమంటే ఆదేశాన్ని అగౌరవపరచినట్లేననీ, మిగిలిన ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఇస్తామని తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, రెండున్నరేళ్లలో 86,000 ఉద్యోగాలు ఇచ్చామని హోంమంత్రి షా అన్నారు. వచ్చే ఆరు నెలల్లో మిగిలిన ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?