డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం చేయాలి : లోక్‌సభలో రాష్ట్రాలకు అమిత్ షా సందేశం

Published : Dec 21, 2022, 05:58 PM IST
డ్రగ్స్‌పై సమిష్టి పోరాటం చేయాలి : లోక్‌సభలో రాష్ట్రాలకు అమిత్ షా సందేశం

సారాంశం

New Delhi: పార్లమెంటు శీతాకాల సమావేశాల 11వ రోజుకు చేరుకున్నాయి. స‌రిహ‌ద్దులో  చైనా బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌ సమస్యపై లోక్ సభలో ప్రతిపక్షాల చ‌ర్చ‌కు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం దీనికి నో చెప్ప‌డం, సంబంధిత వివరాల‌పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు స‌ర్కారుపై విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించాయి.   

Parliament Winter Session-Amit Shah: డ్రగ్స్ దేశానికి తీవ్రమైన సమస్య అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన విధానాన్ని అవలంబించిందని తెలిపారు. డ్రగ్స్ విషయంలో రాజకీయాలు ఉండకూడద‌ని పేర్కొన్న అమిత్ షా..  డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి జీరో టాలరెన్స్ పాలసీ ఉందని తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చాలన్నది ప్రధాని మోడీ సంకల్పమ‌ని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి అవ‌స‌ర‌ముంద‌ని అమిత్ షా అన్నారు. సరిహద్దులు, ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా మాదకద్రవ్యాల ప్రవేశాన్ని మనం ఆపాలని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ, ఎన్సీబీ, యాంటీ డ్రగ్ ఏజెన్సీలు కలిసి మాదకద్రవ్యాల వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడాల‌ని తెలిపారు. 

మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలు డ్రగ్స్ ద్వారా వచ్చే లాభాలను దాని కోసం ఉపయోగిస్తున్నాయ‌ని పేర్కొన్న అమిత్ షా.. ఈ మురికి డబ్బు ఉండటం కూడా క్రమంగా మన ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. అంతర్రాష్ట్ర దర్యాప్తు అవసరమైతే దేశవ్యాప్తంగా ఎన్‌సీబీ దర్యాప్తు చేయవచ్చనీ, ప్రతి రాష్ట్రానికి సహాయం చేసేందుకు ఎన్‌సీబీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశం వెలుపల దర్యాప్తు చేయాలంటే ఎన్ఐఏ కూడా రాష్ట్రాలకు సహాయం చేయగలదని తెలిపారు.

 

డ్రగ్స్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌద‌రి స్పందించారు. భారత్ ను మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చడం గురించి మీరు (హోం మంత్రి) మాట్లాడిన తీరు క్షేత్ర స్థాయిలో మరో విషయాన్ని చెబుతోందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్ స‌భ‌లో అన్నారు. 2018లో డ్రగ్స్ కారణంగా 7,193 మంది ఆత్మహత్య చేసుకోగా, 2021లో 10,560 మంది డ్రగ్స్ కారణంగా మరణించారు. ఈ సంఖ్యలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల 11వ రోజుకు చేరుకున్నాయి. స‌రిహ‌ద్దులో  చైనా బ‌ల‌గాల‌తో ఘ‌ర్ష‌ణ‌ సమస్యపై లోక్ సభలో ప్రతిపక్షాల చ‌ర్చ‌కు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం దీనికి నో చెప్ప‌డం, సంబంధిత వివరాల‌పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంపై ప్ర‌తిప‌క్షాలు స‌ర్కారుపై విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగించాయి. అంతకుముందు అధీర్ రంజన్ చౌదరి కేంద్రంపై విమర్శల గుప్పించారు. కోవిడ్ -19 నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాసినందుకు కాంగ్రెస్ నాయకులు బుధవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. "గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించారా? అని నేను బీజేపీని అడగాలనుకుంటున్నాను. మన్సుఖ్ మాండవీయకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నచ్చలేదని నేను అనుకుంటున్నాను, కానీ ప్రజలు దానిని ఇష్టపడుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే మాండవీయను నియమించాం" అని  అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !