కర్ణాటక క్రైసిస్: రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ధర్నా

By narsimha lodeFirst Published Jul 10, 2019, 3:59 PM IST
Highlights

 కర్ణాటకలో  చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ  నేతలు రాజ్‌భవన్‌ ముందు   బుధవారం నాడు   ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగుళూరు:   కర్ణాటకలో  చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ  నేతలు రాజ్‌భవన్‌ ముందు   బుధవారం నాడు   ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 గవర్నర్‌ను ఉపయోగించుకొని  రాష్ట్రంలో  అధికారంలోకి వచ్చేందుకు  కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న  రాష్ట్రాల్లో ఎక్కువగా గవర్నర్లను కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటుందని  కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.

అరుణాచల్‌ప్రదేశ్ నుండి  కర్ణాటక రాష్ట్రం వరకు కేంద్రం గవర్నర్లను ఇందుకే వినియోగించుకొంటుందని ఆయన ఆరోపించారు.  
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
 

click me!