
PM Modi US Visit: అమెరికాకు చెందిన అమెజాన్ భారత్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీని కలిసిన తర్వాత అమెజాన్ సీఈవో ఆండ్రూ జస్సీ ఈ ప్రకటన చేశారు. మోదీని కలిసిన అనంతరం అమెజాన్ సీఈవో ఆండ్రూ జాసీ మాట్లాడుతూ.. మరిన్ని ఉద్యోగాలు కల్పించడంలో తమవంతు సాయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్నారు.
దీనితో పాటు.. చిన్న , మధ్యతరహా వ్యాపారులకు , భారతీయ కంపెనీలకు సహాయం చేయడం ద్వారా, వారి ఉత్పత్తులను ప్రపంచ స్థాయి మార్కెట్ లో డిమాండ్ కల్పించనున్నట్టు తెలిపారు. భారత్‌లో అమెజాన్ పెద్ద పెట్టుబడిదారు అని అమెజాన్ సీఈవో తెలిపారు. భారత్‌లో అమెజాన్ ఇప్పటివరకు 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు. మరో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా దానిని 26 బిలియన్ డాలర్లకు చేర్చాలనుకుంటున్నామని తెలిపారు.
ఆండ్రూ జెస్సీతో పాటు, ప్రధాని మోదీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు డేవిడ్ ఎల్‌లతో కూడా మాట్లాడారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ఆయనను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మోదీ అమెరికా పర్యటన చారిత్రాత్మకమని, భారత్‌లో డిజిటలైజేషన్ కోసం తమ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోందని పిచాయ్ పేర్కొన్నారు.
మోదీని కలిసిన తర్వాత బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కాల్హౌన్ మాట్లాడుతూ... భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే గొప్ప ఆకాంక్షతో ప్రధాని మోడీ ఉన్నారనీ, విమానయానం, ఏరోస్పేస్ రంగాలపై ప్రధాని మోదీకి ప్రత్యేక ఆసక్తి ఉందని కాల్హౌన్ చెప్పారు. అది అతని విజన్ అని పేర్కొన్నాడు. భారతదేశం తన కోసం మాత్రమే కాకుండా.. మొత్తం ప్రాంతానికి పెద్ద పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు కాల్హౌన్ చెప్పారు.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు టాప్ సీఈఓలతో కీలక భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు, జో బిడెన్ సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, జెరోధా, ట్రూ బీకాన్ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు పాల్గొన్నారు.