Amarnath Cloudburst: జ‌ల‌విల‌యం.. 13 మంది మృత‌దేహ‌ల వెలికితీత‌.. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ల జారీ.. 

By Rajesh K  |  First Published Jul 8, 2022, 10:38 PM IST

Amarnath Cloudburst: అమర్‌నాథ్ గుహ సమీపంలో ప్ర‌కృతి విధ్వంసం సృష్టించింది. ఈ ప్ర‌యాళంలో 50 మందికి పైగా భక్తులు గ‌ల్లంతైన‌ట్టు గుర్తించారు. ఇప్ప‌టివ‌ర‌కు 13 మృతదేహాలు వెలికితీసిన‌ట్టు ఎస్‌డిఆర్‌ఎఫ్ ఉన్నతాధికారి వెల్లడించారు. అదేస‌మ‌యంలో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ల జారీ చేసిన‌ట్టు అధికారులు తెలిపారు.


Amarnath Cloudburst: అమర్‌నాథ్ గుహ సమీపంలో ప్ర‌కృతి విధ్వంసం సృష్టించింది. ఇటీవల కురిసిన కుంభ‌వృషితో  అమర్‌నాథ్‌ గుహ వద్ద జలవిలయం సంభ‌వించింది. వరదలు పోటెత్తాయి. అమర్‌నాథ్ గుహ సమీపంలో భ‌క్తులు వేసుకున్న‌ టెంట్లు, గుడారాలు కొట్టుక‌పోయాయి. పలువురు భక్తులు గ‌ల్లంత‌య్యారు.  

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మరణించారని, దాదాపు 50పైగా భ‌క్తులు గ‌ల్లంత‌య్యార‌ని ఎన్‌డిఆర్‌ఎఫ్ డిజి అతుల్ కర్వాల్ ప్ర‌కటించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నార‌నీ, ఇప్ప‌టి వ‌ర‌కు 13 మృతదేహాలు వెలికితీశామ‌ని తెలిపారు. అందులో 11 మంది మ‌హిళ‌లు ఉండ‌గా.. నలుగురు పురుషులు ఉన్న‌ట్టు తెలిపారు. 

Latest Videos

ఈ ప్ర‌కృతి విలాయంలో  చాలా మందికి గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారిని ప్ర‌త్యేక విమానాల ద్వారా ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం NDRF, SDRP, ఇతర అనుబంధ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి.  

ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని,  కానీ, వర్షం ఇంకా కురుస్తుందని ఐటీబీపీ పీఆర్వో తెలిపారు. ప్రమాద స్థాయి దృష్ట్యా.. అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం సాధారణంగా ఉండి, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తే రేపటి నుంచి ప్రయాణం కొనసాగించవచ్చు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విమానంలో తరలిస్తున్నారు.

ఈ క్ర‌మంలో అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు (helpline numbers) జారీ చేశారు.  

NDRF: 011-23438252, 011-23438253
కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్: 0194-2496240
అమర్‌నాథ్ బోర్డు హెల్ప్‌లైన్: 0194-2313149

ప్రధాని మోదీ సంతాపం 

అమ‌ర్ నాథ్ దుర్ఘటనపై ప్ర‌ధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. “ జ‌లవిల‌యం మ‌రణించిన కుటుంబాల‌కు సంతాపం తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. స‌హాయ‌క చ‌ర్య‌లను ముమ్మ‌రం చేయాల‌ని, బాధితులకు పూర్తి స‌హాయం అందుతుంద‌ని భ‌రోసా నిచ్చారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా.. 

ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అమర్‌నాథ్ గుహ దగ్గర వ‌రద‌లు పోట్టెత్త‌డం బాధ‌క‌ర‌మ‌ని, తాను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నానని అన్నారు. NDRF, CRPF, BSF,  స్థానిక అడ్మినిస్ట్రేషన్ రెస్క్యూ  స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నార‌ని తెలిపారు. ప్రాణాలను రక్షించడం మా ప్రాధాన్యత. భక్తులందరి క్షేమం కోరుకుంటున్నామ‌ని తెలిపారు. 

మాజీ సీఎం సంతాపం  

ఈ ఘ‌ట‌న‌పై జమ్మూ కాశ్మీర్ మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. "అమర్‌నాథ్ గుహ సమీపంలో వ‌ర‌ద‌లు పోటెత్త‌డం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేస్తూ.. అమర్‌నాథ్ గుహ సమీపంలో ప్ర‌కృతి విస్ఫోటనం జ‌ర‌గ‌డం బాధాకరమ‌నీ, అందరూ సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

నిరంతరం కురుస్తున్న వర్షాలు

అమర్‌నాథ్ గుహలోని లోతట్టు ప్రాంతాలలో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో  ఒక్క‌సారిగా వ‌ర‌ద‌లు
వ‌ర‌దలు పొటేత్తిన‌ట్టు పహల్గామ్ జాయింట్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి తెలిపారు. NDRF, SDRF మరియు ఇతర ఏజెన్సీల ద్వారా స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని ఐటీబీపీ తెలిపింది. ఇతర ఏజెన్సీలతో పాటు ఐటీబీపీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నాయి. కొంత మంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మందిని కూడా వరద నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా సేపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. 

జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

కరోనా కారణంగా గత రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయబడింది. ఈ ఏడాది జూన్ 30 నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. 43 రోజుల యాత్ర ఆగస్టు 11న ముగియనుంది. ఈ ఏడాది యాత్రలో దాదాపు మూడు లక్షల మంది యాత్రికులు పాల్గొంటారని అంచనా. ఈ యాత్రలో ఇప్పటివరకు 65,000 మందికి పైగా యాత్రికులు అమర్‌నాథ్ గుహలో బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. 

click me!