కావడిలో అయోధ్యకు: పేరేంట్స్ ను మోసుకెళ్తున్న కొడుకు

By narsimha lode  |  First Published Jan 30, 2024, 1:39 PM IST

అయోధ్యలో రామయ్య దర్శనం కోసం  తల్లిదండ్రులను  ఓ కొడుకు  కావడిలో మోసుకెళ్తున్నాడు.
 


న్యూఢిల్లీ: తల్లిదండ్రులను  కావడిలో మోసుకెళ్లాడని శ్రవణ కుమారుడి గురించి పురాణ గాథలు చెబుతున్నాయి.అయితే అలాంటి  తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. అయోధ్యలో  బాలరాముడిని దర్శించుకొనేందుకు  తల్లిదండ్రులను  అమర్జీత్ వర్మ అనే యువకుడు తన స్నేహితుడి సహాయంతో కావడిలో తీసుకెళ్తున్నాడు.అమర్జీత్ వర్మకు  శ్యామ్ సుందర్ కుమార్  సహాయం చేస్తున్నాడు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల  22న జరిగింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట పూజ చేశారు.  ఈ పూజ పూర్తైన తర్వాత బాలరాముడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 

Latest Videos

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి  దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మంది  ప్రముఖులు హాజరయ్యారు.  ఈ నెల  23వ తేదీ నుండి సామాన్య భక్తులకు  అయోధ్యలో రామయ్య దర్శనం కోసం అవకాశం కల్పించారు.  అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకొనేందుకు ఫిబ్రవరిలో వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

**

click me!