Amar jawan jyoti: చరిత్రలో కలసిపోనున్న అమర్ జవాన్ జ్యోతి.. మండిపడుతున్న విప‌క్షాలు

By Rajesh KFirst Published Jan 21, 2022, 11:57 AM IST
Highlights

Amar jawan jyoti: ఇండియా గేట్ వద్ద ఉన్న‌ అమర జవాను జ్యోతిని, జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో విలీనం చేయ‌డంపై విప‌క్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ తప్పు ప‌ట్టింది.
 

Amar jawan jyoti:1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థంగా  ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన అమర జవాన్ జ్యోతి లేదా ఎటర్నల్ ఫ్లేమ్ నేటితో చరిత్రలో కలసిపోనుంది. శుక్ర‌వారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వార్ మెమోరియల్ లో ఈ జ్యోతిని విలీనం చేయనున్నారు.  

1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో  ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల జ్ఞాప‌కార్థంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి గ‌త 50 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతునే ఉంది. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు అమర జవాన్ జ్యోతిని  శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జాతీయ యుద్ధ స్మారకం జ్యోతిలో క‌లుప‌నున్నారు. 

ప్రభుత్వ నిర్ణ‌యంపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ఈ జ్యోతిని ఆర్పేయ‌డం లేద‌ని..జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేస్తున్నామ‌ని, కానీ  విప‌క్షాలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కోంటున్నాయి.  

అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు మ‌రింత  వివరణ ఇచ్చాయి. జ్యోతిని ఆర్పేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నామని తెలిపాయి. అమర్ జవాన్ జ్యోతి వద్ద  1971 యుద్దంలో ఇతర యుద్ధాల అమరవీరులకు నివాళులు అర్పించడం విచిత్రంగా ఉందనీ, ఇండియా గేట్ మీద ముద్రించిన జవాన్ల పేర్లలో 1971 యుద్ధంలో మరణించిన వారి పేర్లు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్మార‌క స్థూపం పై మొదటి ప్రపంచ యుద్ధం, అఫ్గాన్-ఆంగ్లో యుద్ధంలో పోరాడిన అమరుల పేర్లే ఉన్నాయి. ఇది వలస పాలనను గుర్తు తెస్తుంద‌ని ప్ర‌భుత్వం వాద‌న‌. 

మోడీ హ‌యంలో నిర్మించిన‌ జాతీయ యుద్ధ స్మారకంలో మాత్రం అందరి పేర్లు ఉన్నాయ‌నీ, అమర జవాన్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలి. ఏడు దశాబ్దాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేని వాళ్లు ఇప్పుడు విచారం వ్య‌క్తం చేయ‌డం విడ్డురంగా ఉంద‌ని  కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివర‌ణ.
 
బీజేపీ త‌న ఇష్టానుసారంగా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తోంద‌ని, చరిత్ర చెరిపివేయాల‌ని భావిస్తోందని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.
ఈ నిర్ణ‌యం పై  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శశిథరూర్ తీవ్రంగా విరుచ‌ప‌డ్డారు. బీజేపీ స‌ర్కార్ చర్య.. ప్రజాస్వామ్య సంప్రదాయాల‌పై ఏమాత్రం గౌరవం లేదని తేలిందని అన్నారు.

అని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  'నవ భారతదేశం' కోసం ప్రజలు ఎంతో ఇష్టపడే ఆలోచనలు, స్మారక చిహ్నాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ‌పడ్డారు.

click me!