అల్వార్ ఘటన: టీ తాగి చావుకు కారణమయ్యారు

Published : Jul 23, 2018, 05:59 PM IST
అల్వార్ ఘటన: టీ తాగి చావుకు కారణమయ్యారు

సారాంశం

గోవులను తరలిస్తున్నారనే నెపంతో దాడికి గురైన బాధితుడిని పోలీసులు నేరుగా  ఆసుపత్రికి తరలించకుండా టీ తాగేందుకు కొద్దిసేపు ఆగారు. అయితే నిర్ణీత సమయంలో ఆసుపత్రికి  బాధితుడిని తరలిస్తే  అతను బతికేవాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 


జైపూర్: గోవులను తరలిస్తున్నారనే నెపంతో దాడికి గురైన బాధితుడిని పోలీసులు నేరుగా  ఆసుపత్రికి తరలించకుండా టీ తాగేందుకు కొద్దిసేపు ఆగారు. అయితే నిర్ణీత సమయంలో ఆసుపత్రికి  బాధితుడిని తరలిస్తే  అతను బతికేవాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా నింపాదిగా తిరిగి తిరిగి ఆసుపత్రికి తరలించడంతో మృత్యువాతపడ్డారనే విమర్శలు కూడ ఉన్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌కు చెందిన రక్బర్ అనే వ్యక్తిని ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో కొందరు వ్యక్తులు చితకబాదారు.  నిందితుడి స్వస్థలం హర్యానా. శుక్రవారం రాత్రి కోల్గావ్ ప్రాంతం నుండి ఆవులను తీసుకొని రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ ప్రాంతానికి వెళ్లాడు.

రక్బర్ ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని భావించి దాడి చేశారు.  ఈ ఘటనలో రక్బర్ అక్కడిక్కకడే మృతి చెందారని పోలీసులు తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారని సమాచారం.

పోలీసుల జాప్యం కారణంగానే రక్బర్‌ మృతిచెందాడని కిశోర్‌ అనే ప్రత్యక్షసాక్షి అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి రక్బర్‌ తీవ్రగాయాలతో స్పృహకోల్పోయి పడి ఉన్నాడు. 12.41 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించాం. కానీ పోలీసులు ఘటనాస్థలికి 1.20కి చేరుకున్నారు. రక్బర్‌ శరీరానికి బురద అంటి ఉండడంతో పోలీసులు శుభ్రం చేశారు. 

ఆ తర్వాత ఆవులను గోశాలలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు నేనూ వారికి సాయం చేశాను. ఆ తర్వాత టీ తాగడానికి వాహనాన్ని ఆపారు. టీ తాగిన అనంతరం వాహనాన్ని ఆస్పత్రికి కాకుండా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం 4 గంటలకు రక్బర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు’ అని కిశోర్‌ తెలిపారు. పోలీసులు సకాలంలో బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉండేవని  ఆయన అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !