మతసామర్యం దెబ్బతీసేలా పోస్టులు: ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు జుబేర్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 27, 2022, 9:29 PM IST
Highlights

మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గాను ఆల్గ్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ ను ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేయడంతో పోలీసులు అతడిని విచారించి అరెస్ట్ చేశారు.ఈ విషయమై తగిన ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా పోలీసులు చెప్పారు.
 

న్యూఢిల్లీ: మత పరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, అల్లర్లను రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు గాను ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ Alt News  సహా వ్యవస్థాపకుడు Mohammed Zubair ను  ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు Arrestచేశారు. Twitter లో Delhi  పోలీసులను ట్యాగ్ చేసిన వ్యక్తి పిర్యాదు మేరకు పోలీసులు జుబేర్ ను అరెస్ట్ చేశారు.

జుబేర్ పై 153, 295 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  మత సామరస్యానికి విఘాతం కలిగించే ట్వీట్ల గురించి ట్విట్టర్ హ్యాండిల్ పై పోలీసులను అప్రమత్తం చేయడంతో జుబేర్ ను ఢిల్లీ IFSO పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 నాటి కేసులో ఆయనను ప్రశ్నించడానికి ఇవాళ పిలిపించారు. స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు సమయంలో మహ్మద్ జుబేర్ మత సామరస్యానికి విఘాతం కల్గించేలా ట్వీట్లు చేశారని ఆధారాలు లభించడంతో  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.కొన్ని ట్వీట్లను ఇప్పటికే డిలీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఒక  వర్గానికి చెందిన దేవుడిని ఉద్దేశ్యపూర్వకంగా అవమానించే ఉద్దేశ్యంతో చిత్రాన్ని జుబేర్ ట్వీట్ చేశారని ఫిర్యాదులో ఫిర్యాదిదారుడు పేర్కొన్నారు. ఈ ట్వీట్లు రీట్వీట్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు.  మత సామరస్యం దెబ్బతీయడంతో పాటు ప్రజల ప్రశాంతతను వ్యతిరేకంగా ఉందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో జుబేర్ ను పోలీసులు జుబేర్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. తగిన సాక్ష్యాల ఆధారంగా అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు.నోటీసులు ఇవ్వలేదని, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కానీ కూడా ఇవ్వలేదని ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా చెప్పారు. ఇదిలా ఉంటే 2020 లో నమోదైన కేసులో ఇవాళ విచారణకు రావాలని పోలీసులు జుబేర్ కు సమన్లు పంపారు. ఈ కేసులో కాకుండా తాజాగా నమోదైన కేసులో జుబేర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

జుబేర్ అరెస్ట్ పై టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ జర్నలిస్టుల్లో ఒకరైన మహ్మద్ జుబేర్  అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రతి రోజూ బీజేపీ ఫేక్ న్యూస్ ను జుబేర్ ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నాడని ఓబ్రెయిన్ చెప్పారు.జుబేర్ అరెస్ట్ ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖండించారు. సత్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. 
 

click me!