చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. కానీ అది జరగదు - శివసేన ఎంపీ సంజయ్ రౌత్

By team teluguFirst Published Jan 27, 2022, 1:02 PM IST
Highlights

చరిత్రను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే అది సాధ్యం కాదని అన్నారు. చరిత్ర అందరికీ తెలుసని చెప్పారు. 

చరిత్రను మార్చేందుకు బీజేపీ (bjp)ప్రయత్నిస్తోందని అయితే ఆ ప్ర‌య‌త్నం కొన‌సాగవ‌చ్చు కానీ.. దానిలో విజ‌యం సాధించ‌లేద‌ని శివసేన ఎంపీ సంజ‌య్ రౌత్ (shiva sena mp sanjay rauth) అన్నారు. మ‌హారాష్ట్ర‌లోని ముంబాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు టిప్పు సుల్తాన్ (tippu sulthan) పేరు పెట్టడంపై బీజేపీ ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సంజ‌య్ రౌత్ వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వాల‌కు సొంతంగా ప‌లు నిర్ణ‌యం తీసుకునే సామర్థ్యం ఉంద‌ని సంజ‌య్ రౌత్ అన్నారు. 
తమకు మాత్రమే చరిత్ర జ్ఞానం ఉందని బీజేపీ భావిస్తోందని అని తెలిపారు. అయితే అందరూ కొత్త చరిత్ర రాయడానికి కూర్చున్నారని చెప్పారు. కొత్త చరిత్రకారులు చరిత్రను మార్చేందుకు వచ్చార‌ని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే టిప్పు సుల్తాన్ గురించి త‌మకు తెలుసని, బీజేపీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదని సేన ఎంపీ అన్నారు. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదు. కొత్త చరిత్ర రాయవద్దు. మీరు ఢిల్లీలో చరిత్రను మార్చే ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు కానీ మీరు విజయం సాధించలేరు’’ అని రౌత్ తెలిపారు.

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (president ramnath kovind) కర్నాటకకు వెళ్లినప్పుడు టిప్పు సుల్తాన్‌ను చారిత్రాత్మక యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు అని కొనియాడారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రపతిని కూడా  రాజీనామా చేయ‌మ‌ని కోర‌తారా అని సంజ‌య్ రౌత్ ప్ర‌శ్నించారు. దీనిపై బీజేపీ స్పష్టత ఇవ్వాల‌ని తెలిపారు. ఇదంతా డ్రామా అని అని అన్నారు. 

18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును ముంబైలోని మలాడ్‌లోని ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు పెట్ట‌డం పెద్ద వివాదాన్ని సృష్టించింది. దీనిని బీజేపీ తీవ్రంగా నిర‌సించింది. టిప్పు సుల్తాన్హిం దువులను హింసించాడని తెలిపారు. ప్ర‌జ‌లు ఉప‌యోగించే కట్ట‌డాల‌కు ఆయ‌న పేరు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

ఇదిలావుండగా.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు అధికారికంగా టిప్పు సుల్తాన్ పేరు ఇంకా ఖరారు కాలేదని మహారాష్ట్ర పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే (aditya takre) స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్ట్‌లకు అధికారిక పేర్లను ఖరారు చేయడం BMC పరిధిలోకి వస్తుంది. అయితే ఆ పార్కు అధికారిక పేర్లపై నిర్ణయం తీసుకోలేదని మేయర్ చెప్పారు.’’ అని మంత్రి తెలిపారు. అయితే ఈ వివాదానికి కార‌ణ‌మైన సోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి అస్లాం షేక్ ఈ విష‌యంపై స్పందించారు. అస‌లు తామేమి ఇప్పుడు కొత్త‌గా పేరు పెట్లలేద‌ని చెప్పారు. గ‌తంలోనే ఆ ప్రాంగ‌ణానికి టిప్పు సుల్తాన్ అని పేరు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఎలాంటి కొత్త పేరు పెట్టలేద‌ని అన్నారు. 

దాని కంటే ముందు నాగ్‌పూర్‌లో బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (devendra padnavees) విలేకరులతో మాట్లాడారు. ‘‘టిప్పు సుల్తాన్ తన రాష్ట్రంలో హిందువులపై అఘాయిత్యాలకు చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందాడు. అలాంటి వ్యక్తులను గౌరవించడాన్ని బీజేపీ ఎన్నటికీ అంగీకరించదు. సోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టిన టిప్పు సుల్తాన్ పేరును వెంటనే రద్దు చేయాలి’ అని దేవేంద్ర పడ్నవీస్ డిమాండ్ చేశారు. 

click me!