అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీరాముడు, కృష్ణుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ మితవాద సంస్థలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది.
శ్రీరాముడు, కృష్ణుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై కేసు నమోదైంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్, భజరంగ్ దళ్ మండిపడ్డాయి. ఆ హిందూ సంస్థలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సంయుక్తంగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆదివారం సాయంత్రం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకీ ప్రొఫెసర్ ఏమన్నారంటే ?
యూనివర్సిటీలోని మధ్యయుగ, ఆధునిక చరిత్ర విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న విక్రమ్ హరిజన్ ఇటీవల తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘శ్రీ రాముడు ఈరోజు జీవించి ఉంటే, ఋషి శంభుకుడిని చంపినందుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం నేను జైలుకు పంపి ఉండేవాడిని. కృష్ణుడు ఈ రోజు జీవించి ఉంటే, స్త్రీలపై లైంగిక వేధింపుల కేసులో జైలుకు పంపి ఉండేవాడిని.’’ అని పేర్కొన్నారు.
यदि आज प्रभु श्री राम होते तो मैं ऋषि शम्भुक का वध करने के लिए उनको मैं आईपीसी की धारा 302 के तहत जेल भेजता और यदि आज कृष्णा होते तो महिलाओं के साथ सेक्सुअल हैरेसमेंट के केस के लिए उनको भी मैं जेल में भेजता ???
— Professor Dr.Vikram (@ProfDrVikram1)
అయితే ఈ వ్యాఖ్యలపై మితవాత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రొఫెసర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, యూనివర్సిటీలోని పలువురు విద్యార్థులకు ఆగ్రహం తెప్పించిందని ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీహెచ్ పీ జిల్లా కన్వీనర్ శుభమ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ మేరకు కల్నల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు ప్రొఫెసర్ హరిజన్ పై ఐపీసీ సెక్షన్లు 153-ఏ (మత ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295-ఏ (మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశపూర్వక, దురుద్దేశపూర్వక చర్య), ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు.
కాగా.. దీనిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ శుభమ్ ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. తాను రాజ్యాంగ పరిధిలోనే పోస్టు పెట్టానని చెప్పారు. శూద్ర కులానికి చెందిన శంభుక్ యువకులకు బోధిస్తున్నాడనే కారణంతో రాముడు అతడిని చంపాడని ఆరోపించారు. అలాగే శ్రీకృష్ణుడు మహిళల దుస్తులతో పారిపోయేవాడని చెప్పారు. ఈ రోజుల్లో ఇలా జరిగితే ఏ స్త్రీ అయినా సహిస్తుందా అని ప్రశ్నించారు. అసిస్టెంట్ వ్యాఖ్యలపై వీహెచ్ పీకి చెందిన శుభం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను ఇస్తుందని, కానీ విక్రమ్ హరిజన్ వంటి వ్యక్తులు సామాజిక అశాంతిని వ్యాప్తి చేయడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. దేశ భద్రతకు, ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగం అనుమతించదనే విషయం ఆయన తెలియనట్టుందని తెలిపారు.