ఊరి పేరు మారినా.. హైకోర్టు పేరు మారదట

By sivanagaprasad kodatiFirst Published Jan 1, 2019, 2:06 PM IST
Highlights

దేశంలోని అత్యంత పురాతన హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు ఒకటి.. అయితే ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టును అలహాబాద్ హైకోర్టుగానే కొనసాగిస్తున్నారు.

కోర్టు పేరు మార్పు గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు యూపీ న్యాయశాఖను ప్రశ్నించగా... ప్రభుత్వం ఇప్పట్లో అలహాబాద్ హైకోర్టు పేరును మార్చాలనుకోవడం లేదని తెలిపింది. దీనికి కారణం లేకపోలేదు..

కేంద్రప్రభుత్వం 2016లో బొంబాయి, మద్రాస్, కోల్‌కతా హైకోర్టుల పేర్లను మార్చేందుకు ఒక బిల్లు తీసుకొచ్చింది. అయితే ఇందుకు ఆయా హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఈ బిల్లు పార్లమెంట్‌కు చేరలేదు. ఈ బిల్లుకు ఆమోదం లభించిన తరువాతనే హైకోర్టుల పేర్ల మార్పునకు అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
 
click me!