అయోధ్య : అఖండ దీపం అంటే ఏమిటి? ఎందుకు వెలిగిస్తారు?

By SumaBala Bukka  |  First Published Jan 6, 2024, 10:23 AM IST

అయోధ్య రామమందిరంలో అన్ని ప్రత్యేకతల్లో అఖండదీపమూ ఒకటి. దీనికి సంబంధించిన ప్రత్యేక విశేషాలు ఇవి... 


అయోధ్య : అయోధ్య రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ప్రముఖులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే రామాలయానికి దేశం నలుమూలల నుంచి పూజా సామాగ్రి, తదితరాలను భక్తులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య చేరుకున్న రామ మందిరంలో కూడా అఖండ దీపం వెలిగించనున్నారు. ఈ అఖండ దీపానికి సంబంధించిన మరిన్ని ప్రత్యేక విషయాలు ఇవే.. 

అఖండ దీపం 
జనవరి 22, 2024న ఆలయ ప్రారంభోత్సవం, రామ్ లల్లా ప్రాణప్రతిష్ట తరువాత అయోధ్యలోని రామ మందిరంలో అఖండ దీపం కూడా వెలిగిస్తారు. ఇది నిరంతరం అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. ఈ అఖండ దీపాన్ని వెండితో తయారు చేశారు. వెండితో చేసిన ఈ దీపం రామమందిరంలో పగలు రాత్రి నిరంతరాయంగా వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. ఈ ఏకశిలా దీపాన్ని వెలిగించాలంటే నూనె కాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించబడుతుంది.

Latest Videos

అయోధ్య చరిత్ర తెలుసా? మరుగున పడిన రామజన్మభూమిని కనిపెట్టి, ఆలయాన్ని నిర్మించిందెవరంటే...

అఖండ దీపం అంటే ఏమిటి?
అఖండ దీపం అంటే ఒక్కసారి వెలిగిస్తే.. ఆరిపోకుండా నిరంతరం వెలుగేలా చూసుకునేది. ఈ దీపం ఏళ్ల తరబడి వెలుగుతూనే ఉంటుంది. దీని వత్తిని మార్చాల్సి వస్తే.. ముందుగా ఈ దీపం నుండి మరొక దీపం వెలిగిస్తారు. ఆ తరువాత వత్తిని మార్చాక, అదే దీపం నుండి మళ్లీ వెలిగిస్తారు. ఈ దీపం ఎప్పటికీ ఆరిపోకుండా ఉండేలా అప్పుడప్పుడు దానికి నెయ్యి కూడా కలుపుతారు.

గుడిలో అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారు?
దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో అఖండ దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. అయోధ్యలో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దీపం కాంతికి చిహ్నం. కాంతి అంటే ఎల్లప్పుడూ ఉండే జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఎవరూ మీ నుండి లాక్కోలేరు లేదా మీ నుండి ఎవరూ దొంగిలించలేరు. సనాతన ధర్మంలో, ఈ జ్ఞాన కాంతి మనకు సరైన మార్గాన్ని చూపుతుంది.  సరైన పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఏకశిలా దీపం కూడా సనాతన ధర్మపు శాశ్వతమైన మరియు అనంతమైన ఉనికికి చిహ్నం.

గమనిక : ఈ కథనంలో ఇచ్చిన సమాచారం జ్యోతిష్యులు, పంచాంగం, మత గ్రంథాలు, నమ్మకాలపై ఆధారపడింది మాత్రమే. ఈ సమాచారాన్ని అందించడానికి మేమొక మాధ్యమం మాత్రమే. పాఠకులు ఈ సమాచారాన్ని సమాచారంగా మాత్రమే పరిగణించాలని ప్రార్థన.

click me!