న్యూఢిల్లీ:కరోనా లాక్‌డౌన్ ను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. దీంతో డొమెస్టిక్, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టుగా కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ మంగళవారం నాడు ప్రకటించింది.
దేశీయ, అంతర్జాతీయ విమానసర్వీసులను మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్టుగా కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ ప్రకటించింది. మార్చి 24వ తేదీకి ముందే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇండియా నిషేధించింది.
అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు. కార్గో విమాన సర్వీసులను మాత్రం నడుపుతున్నారు. మరో వైపు రైల్వే శాఖ కూడ ఇదే రకమైన నిర్ణయం తీసుకొంది.
also read:
లాక్‌డౌన్‌కు పోలీసులకు మద్దతుగా నిలిచిన గిన్నిస్ రికార్డు విజేత
లాక్ డౌన్ ను పురస్కరించుకొని గూడ్స్ రైళ్లు మినహా ప్యాసింజర్ రైళ్లను కేంద్రం నిలిపివేసింది. రెండో విడత కేంద్రం లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా మంగళవారం నాడు మోడీ ప్రకటించారు.రైల్వే శాఖ కూడ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను కూడ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ లో రైల్వే శాఖ ప్రకటించింది.