80 ప్రభుత్వ ఉద్యోగాలు.... 8వేల మంది అభ్యర్థులు...ఒక్కరూ అర్హత సాధించలేదు

By Arun Kumar PFirst Published Aug 22, 2018, 2:44 PM IST
Highlights

ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా పీహెచ్‌డి, పిజిలు చేసిన యువత లక్షల్లో దరఖాస్తులు చేసుకున్న అనేక సంఘటనలను మనం చూశాం. కానీ ఈ విషయంలో గోవాకు మినహాయింపు ఇవ్వాల్సి వస్తుందేమో. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహిస్తే కేవలం 8వేల మందే  హాజరయ్యారు. అందులో ఒక్కరు కూడా కనీస మార్కులు సాధించలేకపోయారు. దీంతో ఆ ఉద్యోగాలు అలాగే ఖాళీగా మిగిలిపోయాయి.

గోవా అకౌంటెంట్ డైరక్టరేట్ కార్యాలయం తమ శాఖలో ఖాళీల భర్తీకి పూనుకుంది. ఇందుకోసం 80 అకౌంటెంట్ ఉద్యోగాల కోసం నోటిపికేషన్ జారీ చేసింది. అయితే ఇందుకోసం నిర్వహించిన పరీక్షలో కేవలం 8వేల మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వంద మార్కులకు గాను 50 మార్కులు సాధిస్తే చాలు ప్రభుత్వోద్యోగం వస్తుంది. కానీ ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా కనీస అర్హత మార్కులు సాధించలేక పోయారు.  దీంతో అభ్యర్థులు లేక ఆ ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయాయి.  

ఈ ఘటన ప్రభుత్వ ఉద్యోగాలపై గోవా యువతలో ఉన్న అనాసక్తతతో పాటు విద్యావిధానంలో లోపాలను తెలియజేస్తుంది. గోవాలోని యూనివర్సిటీలు క్వాలిటీ లేని విద్యను అందిస్తున్నాయని ఇప్పటికే పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం మరింత కలకలం రేపింది.   

click me!