భారతీయ నగరాల్లో పెరుగుతోన్న వాయు కాలుష్యం.. ఢిల్లీ బాటలో ముంబై, స్వచ్ఛమైన గాలి కరువు

By Siva KodatiFirst Published Dec 11, 2022, 4:05 PM IST
Highlights

దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. ఇక్కడ గాలి నాణ్యత కూడా అధ్వాన్నంగా వుందని గణాంకాలు చెబుతున్నాయి. 

ప్రపంచీకరణ కానీ, పారిశ్రామికీకరణ అవ్వని.. మనదేశంలో కాలుష్యం బారినపడుతున్న నగరాల జాబితా నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అల్లాడిపోతోంది. సరి బేసి విధానాలని, బాణాసంచాపై నిషేధమని చెబుతూ రకరకాల నిబంధనలను అమల్లోకి తెచ్చినా ఢిల్లీ వాసులకు వాయు కాలుష్యం బెడద పోవడం లేదు. ఇక్కడ గాలి నాణ్యత శాతం క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగరం కూడా చేరుతోంది. పరిశ్రమలు, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ముంబైలో వాయు కాలుష్యం పెరుగుతోంది. కొన్నిరోజులుగా ఉదయం పూట నగరంలో దట్టంగా పొగమంచు కమ్ముకుని వుంటుంది. దీంతో రోడ్లపై వెలుతురు సరిగా వుండటం లేదు. ముంబై నగరంలో గాలి నాణ్యత ప్రస్తుతం అధ్వాన్నంగా వుందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. 

ఢిల్లీలో గాలి కాలుష్యం వల్ల బతుకు భారంగా మారుతోంది. ఢిల్లీ, దాని పరిసరా ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం ఉదయం వాయు గాలుష్యం మరింత తీవ్రమైంది. వాయు నాణ్యత సూచీ 408గా నమోదైంది. ఈ సూచీలో 401 నుంచి 500 మధ్య ఉంటే దానిని తీవ్రస్థాయిగా పరిగణిస్తారు. చలికాలం, రాజధాని నగరంలో వాహనాల నుంచి వచ్చే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. 

ALso REad""మా పిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపతున్నారు"

ఇదిలావుండగా... కలుషితమైన గాలి వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కంటి చూపు తగ్గుతుంది. కంటి సమస్యలు వస్తాయి. అలాగే గుండె ఆరోగ్యం క్షీణిస్తుందన్న విషయాలు దాదాపు అందరికీ ఎరుకే.. కానీ ఇది పురుషులలో స్మెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరాళ్లో నివసించే వారి సెక్స్ డ్రైవ్ కు ఈ కలుషితమైన గాలి ప్రతికూకలంగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. నగరాల్లో నివసించే వారు ఈ గాలి కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలు, ఉబ్బసం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, సైనసైటిస్ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నాయి. అయితే ఇది పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నవారిలో లైంగిక ఆసక్తిని తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 

గాలి కాలుష్యం వల్ల మగ వంధ్యత్వం రోజు రోజుకు పెరిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు.  దీనివల్ల జంట గర్భం దాల్చడం కష్టంగా మారింది. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారు. నగరాల్లో సంతానోత్పత్తి సమస్యను ఫేస్ చేస్తున్న పురుషుల సంఖ్య స్త్రీల కంటే 15 శాతం ఎక్కువగా ఉంది. ఈ గాలి కాలుష్యం మగ వంధ్యత్వానికి, గర్భస్రావాలకు ప్రధాన కారణంగా మారింది.  

click me!