సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు షాకిచ్చిన ఎయిర్ ఇండియా.. ఇక నుంచి టికెట్లపై రాయితీ త‌గ్గింపు

By Rajesh KarampooriFirst Published Sep 29, 2022, 11:54 PM IST
Highlights

సీనియర్ సిటిజన్ల‌కు, విద్యార్థుల ఎయిర్ ఇండియా షాక్ ఇచ్చింది.  వారికి అందించే రాయితీని 50% నుండి 25%కి తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది
 

విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీనియర్ సిటిజన్ల, విద్యార్థులకు ఇచ్చే రాయితీలపై కోత విధించింది. వారికి అందించే రాయితీని 50% నుండి 25%కి తగ్గించాలని నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. రాయితీల్లో కోత విధిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ నిర్ణ‌యం త‌ర్వాత కూడా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు ఇచ్చే రాయితీని ఇతర కంపెనీలతో పోలిస్తే..  రెట్టింపు అవుతాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అదే స‌మ‌యంలో ఇతర వర్గాల ప్రయాణికులకు రాయితీల్లో ఎలాంటి మార్పు లేదని ప్రతినిధి తెలిపారు.

ఎయిర్ ఇండియా ప్రస్తుతం సాయుధ దళాలు, అర్జున అవార్డు గ్రహీతలు, గ్యాలంట్రీ అవార్డు విజేతలు, క్యాన్సర్ రోగులు, అంధులకు ఇతరులకు రాయితీలను అందిస్తోంది. అయితే, ఇటీవల టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పుడు.. మినహాయింపు తగ్గింపు గురించి సమాచారం తెరపైకి వచ్చింది. ఎయిర్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సాయుధ దళాల క్రియాశీల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు  స్వంత ఖర్చుతో ప్రయాణిస్తే, మినహాయింపుకు అర్హులని తెలిపింది. 

క్యాన్సర్ రోగులకు 50% తగ్గింపు

ఎయిర్ ఇండియా.. క్యాన్సర్ రోగులకు 50% రాయితీని ప్ర‌క‌టిస్తోంది. ఇందులో కుటుంబంలోని వివాహిత సభ్యులు మినహా 2-26 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. క్యాన్సర్ రోగులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించినట్లయితే.. వారి బేస్ ఫేర్‌లో 50% తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ రాయితీ భారతదేశంలో నివాసితులైన‌ క్యాన్సర్‌తో బాధపడుతూ.. చికిత్స కోసం ప్రయాణించే వారికి మాత్రమే చెల్లుతుంది. క్యాన్సర్ రోగి నేపాల్ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నట్లయితే..  రోగికి వారి బేస్ ఫేర్‌లో తగ్గింపు లభిస్తుంది. Air India అందించే డిస్కౌంట్‌లు CTO, ATO లేదా కంపెనీ వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకునే వారి డిస్కౌంట్ పాలసీ కింద కవర్ చేయబడిన వారందరికీ వన్-వే, టూ-వే ప్రయాణాలకు వర్తిస్తాయి.

click me!